హోమ్ /వార్తలు /క్రీడలు /

BCCI : దేశవాళి క్రికెట్ మళ్లీ షురూ.. రంజీ ట్రోఫీ నుంచి విజయ్ హజారే టోర్నీ వరకు పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి

BCCI : దేశవాళి క్రికెట్ మళ్లీ షురూ.. రంజీ ట్రోఫీ నుంచి విజయ్ హజారే టోర్నీ వరకు పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి

పట్టాలెక్కబోతున్న దేశవాళీ క్రికెట్.. షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ(BCCI)

పట్టాలెక్కబోతున్న దేశవాళీ క్రికెట్.. షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ(BCCI)

దేశవాళీ క్రికెట్ తిరిగి పట్టాలు ఎక్కబోతున్నది. గత ఏడాది కరోనా కారణంగా రంజీ ట్రోఫీని పూర్తిగా రద్దు చేశారు. ఈ సారి పలు నగరాల్లో రంజీ ట్రోఫీతో పాటు వివిధ వయో విభాగాలకు సంబంధించిన దేశవాళీ క్రికెట్ కూడా నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి (Corona Pandemic) కారణంగా గత ఏడాది పూర్తిగా రద్దయిన రంజీ ట్రోఫీని (Ranji Trophy) తిరగి ఈ ఏడాది పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ (BCCI) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పురుషులు, మహిళల అన్ని వయో విభాగాలలో క్రికెట్ మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ తెలిపింది. 2021-22 సీజన్‌లో మొత్తం 2127 మ్యాచ్‌లు నిర్వహించనునున్నారు. రంజీట్రోఫీ నవంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నది. దీంతో పాటు ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ చెప్పింది. అయితే ఈ ఏడాది ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ, దేవ్‌ధర్ ట్రోఫీలను నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. గత ఏడాది రంజీ  ట్రోఫీ నిర్వహించకపోవడంతో పాటు పలు దేశవాళీ టోర్నీలు కూడా కరోనా కారణంగా రద్దు చేశారు. దీంతో దేశవాళీ క్రికెట్ ద్వారా ఉపాధి పొందుతున్న అనేక మంది ప్రొఫెషనల్ క్రికెటర్లు జీతభత్యాలు లేక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. వారికి తాజా సీజన్ జీతభత్యాలతో పాటు గత సీజన్ నష్టపరిహారాన్ని కూడా చెల్లించనున్నట్లు తెలుస్తున్నది. బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ఇలా ఉన్నది. వేదికలను తర్వాత ప్రకటిస్తారు.

పురుషుల క్రికెట్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20) - 2021 అక్టోబర్ 10 నుంచి నవంబర్ 12

రంజీ ట్రోఫీ - 2021 నవంబర్ 16 నుంచి 2022 ఫిబ్రవరి 2 వరకు

విజయ్ హజారే వన్డే ట్రోఫీ - 2022 ఫిబ్రవరి 23 నుంచి 2022 మార్చి 26 వరకు

పురుషుల అండర్ 23

కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ - 2021 నవంబర్ 18 నుంచి 2022 ఫిబ్రవరి 12 వరకు

మెన్స్ స్టేట్ ఏ వన్డే ట్రోపీ - 2022 ఫిబ్రవరి 23 నుంచి 2022 మార్చి 26 వరకు

పురుషుల అండర్ 19

వినూ మన్కడ్ ట్రోఫీ (వన్డే) - 2021 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29 వరకు

మెన్స్ అండర్ 19 వన్డే ఛాలెంజర్స్ ట్రోఫీ - 2021 నవంబర్ 3 నుంచి నవంబర్ 9 వరకు

బాలుర అండర్ 16

కూచ్ బెహర్ ట్రోఫీ - 2021 నవంబర్ 14 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు

విజయ్ మర్చంట్ ట్రోఫీ - 2021 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 16 వరకు

మహిళల సీనియర్ క్రికెట్

సీనియర్ మహిళల వన్డే లీగ్ - 2021 సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 22 వరకు

సీనియర్ మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ - 2021 అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు

సీనియర్ మహిళల టీ20 లీగ్ - 2022 మార్చి 19 నుంచి 2022 ఏప్రిల్ 11 వరకు

మహిళలు అండర్ 23

మహిళల అండర్ 23 టీ20 లీగ్ - 2022 జనవరి 17 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు

మహిళల అండర్ 23 వన్డే లీగ్ - 2022 ఫిబ్రవరి 11 నుంచి 2022 మార్చి 15 వరకు

మహిళలు అండర్ 19

మహిళలు అండర్ 19 వన్డే లీగ్ - 2021 అక్టోబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు

మహిళలు అండర్ 19 టీ20 లీగ్ - 2021 నవంబర్ 4 నుంచి 2021 నవంబర్ 27 వరకు

మహిళలు అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ - 2021 డిసెంబర్ 1 నుంచి 2021 డిసెంబర్ 5 వరకు

First published:

Tags: Bcci, Cricket

ఉత్తమ కథలు