క్రికెట్ ఫ్యాన్స్‌కు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) గుడ్‌న్యూస్ చెప్పనుంది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆశను త్వరలో నెరవేర్చనుంది. ఆసీస్ మాదిరిగానే ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌కు కనీసం 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. కరోనా నేపథ్యంలో కేవలం ఖాళీ మైదానాల్లోనే క్రీడా ఈవెంట్స్ జరుగుతున్న వేళ.. వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతుండడంతో ప్రేక్షకులను నేరుగా మ్యాచ్‌లు వీక్షించేందుకు అనుమతి ఇవ్వానున్నారు. ఈ పర్యటన మెుత్తం
మూడు స్టేడియాల్లోనే జరగనుంది.
ఈ టూర్లో భాగంగా భారత్,ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. చెన్నై, అహ్మదాబాద్, పుణె వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అయితే అభిమానులను అనుమతించడంపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికి.. ఈ విషయం క్లారీటి ఇవ్వాలని బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులను అనుమతించడం బీసీసీఐ కసరత్తు ప్రారంభించనట్లుగా అర్ధమవుతుంది. రాష్ట్ర సంఘాలు మాత్రం 20 నుంచి 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. చివరిగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు ప్రత్యేక్షంగా చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభణతో ఈవెంట్స్ వాయిదా పడడం.. కోవిడ్ ప్రోటోకాల్, ఇండియాలో మ్యాచ్‌లు జరగకపోవడంతో అభిమానులు మైదానంలో ఆటను వీక్షించే అవకాశం లేకుండా పోయింది. క్రికెట్ అబిమానులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ కూడా యూఏఈలో ప్రేక్షకులు లేకుండా జరిగింది.
కీలకమైన ఆసీస్ పర్యటన ముగిసిన తరుణంలో మరొ కీలక పోరుకు టీమిండియా సిద్దమవుతుంది. ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మెుదటి రెండు టెస్ట్‌ల కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టులో ఆసీస్ పర్యటన పూర్తి స్థాయిలో కొనసాగించని హార్దిక్ పాండ్యాకు.. గాయంతో బాధపడ్డ బౌలర్ ఇషాంత్ శర్మ చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో రాణించని యువ బాట్స్మెన్ పృథ్వీ షాపై వేటు పడింది. రవీంద్ర జడేజా, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ గాయంతో బాధపడుతుండడం తొలి రెండు టెస్టులకు వారిని ఎంపీక చేయలేదు. అలాగే యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్‌ను కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఈ జట్టుకు ఎప్పటిలాగే కోహ్లీ సారథ్యం వహించనున్నారు. వైస్ కెప్ట్‌న్‌గా రోహిత్ శర్మ కాకుండా మళ్ళీ రహానేకు ఎంపీక చేసి హిట్‌మ్యాన్‌కు షాక్ ఇచ్చారు
ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులు ఆడే టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్