Home /News /sports /

BCCI AGM LIKELY TO DISCUSS FATE OF INDIA TOUR TO SOUTH AFRICA TODAY JNK

BCCI AGM: నేడు బీసీసీఐ ఏజీఎం.. దక్షిణాఫ్రికా పర్యటన, ఐపీఎల్ మెగా ఆక్షన్, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలపై కీలక నిర్ణయం

నేడు కోల్‌కతాలో బీసీసీఐ ఏజీఎం.. కీలక విషయాలు చర్చించనున్న బోర్డు

నేడు కోల్‌కతాలో బీసీసీఐ ఏజీఎం.. కీలక విషయాలు చర్చించనున్న బోర్డు

BCCI AGM: బీసీసీఐ సర్వసభ్య సమావేశం ఇవాళ కోల్‌కతా వేదికగా జరుగనున్నది. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా పర్యటన, మెగా వేలం పాట తేదీ, అహ్మదాబాద్ జట్టు అనిశ్చితిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా సహా బోర్డు సభ్యులు అందరూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

ఇంకా చదవండి ...
  ఏడాది ముగియడానికి వస్తుండటంతో బీసీసీఐ (BCCI) సర్వ సభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నది. కోల్‌కతా వేదికగా జరుగునున్న ఈ ఏజీఎంలో (AGM) 24 అంశాలతో కూడిన అజెండాపై చర్చ జరుపనున్నారు. బీసీసీఐ ముందు ప్రస్తుతం పలు సమస్యలు ఉన్నాయి. తక్షణమే పరిష్కరించవలసిన వాటిని ఎమర్జెన్సీ అజెండాలో పొందుపర్చి చర్చించనున్నట్లు తెలుస్తున్నది. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), కార్యదర్శి జైషా (Jay Shah), కోశాధికారి అరుణ్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సహా బోర్డు సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ ఏజీఎం అజెండాలో లేకపోయినా ముందుగా దక్షిణాఫ్రికా పర్యటనపైనే (India Tour of South Africa) చర్చ జరుగనున్నట్లు తెలుస్తున్నది. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు (Team India) రెండో టెస్టు ముగిసిన వెంటనే డిసెంబర్ 9న ముంబై నుంచి జొహన్నెస్ బర్గ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లాల్సి ఉన్నది. కానీ అక్కడ ఒమిక్రాన్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అసలు ఈ పర్యటనను యధాతథంగా కొనసాగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో 3 టెస్టులు, 3 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. సుదీర్ఘమైన ఈ పర్యటనను కుదిస్తే ఎలా ఉంటుందని కూడా చర్చించనున్నారు.

  ఇటీవల భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లో పేలవమైన ప్రదర్శన చేసి కనీసం సూపర్ 12 స్టేజ్ కూడా దాటలేకపోయింది. దీనికి గల కారణాలను ఏజీఎంలో చర్చించనున్నారు. మరోవైపు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీవీఎస్‌ను నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్‌గా నియమించారు. ఇప్పుడు అక్కడ ఉన్న కోచ్‌లు, ఇతర సిబ్బంది కాంట్రాక్టుల రెన్యూవల్‌పై ఒక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ సీనియర్, ఇండియా ఏ, అండర్ 19, మహిళా సీనియర్, అండర్ 19 సెలెక్టర్ల పదవీ కాలం పొడగింపు, కాంట్రక్టు పునరుద్దరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

  Pro kabaddi League: డాష్, బ్లాక్.. కబడ్డీలో ఉన్న ఐదు ఫన్నీ డిఫెన్స్ స్ట్రాటజీలు మీకు తెలుసా?


  ఇటీవల వాయిదా పడిన ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్‌పై కీలక చర్చ జరుగనున్నది. ఈ ఏడాది జూన్‌లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పర్యటించింది. అయితే 4 మ్యాచ్‌లు సక్రమంగా జరిగినా.. ఆఖరి టెస్టు కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. రద్దైన టెస్టును ఎప్పుడు? ఎలా? నిర్వహించాలనే విషయంలో కూడా బీసీసీఐ చర్చ జరుపనున్నది. టీమ్ ఇండియా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్‌పై కూడా కీలక చర్చ జరుగనున్నది.

  Ind Vs Nz : " రివ్యూలు ఉండి ఏం ప్రయోజనం.. థర్డ్ అంపైర్ కి ఓ జత కళ్లద్దాలు కొనివ్వండి.. "
  ఇక ఐపీఎల్ వేలం పాటను ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రిటెన్షన్స్ పూర్తయ్యాయి. అయితే రెండు కొత్త జట్ల ఫ్రీ పికప్ నిబంధన మాత్రం అమలులోకి రాలేదు. అహ్మదాబాద్ జట్టుకు పూర్తి స్థాయిలో అంగీకారం తెలుపనందునే ఈ ఆలస్యం జరుగుతున్నది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాటిపై నలుగురు సభ్యులతో కూడాని కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఈ రోజు బీసీసీఐ ఏజీఎం ముందుకు రానున్నది. అహ్మదాబాద్ జట్టు విషయంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటే.. ఆ తర్వాత వేలం పాట తేదీలను కూడా నిర్ణయించనున్నట్లు తెలుస్తున్నది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:John Kora
  First published:

  Tags: Bcci, India vs South Africa, IPL 2022, Sourav Ganguly

  తదుపరి వార్తలు