హోమ్ /వార్తలు /క్రీడలు /

BCCI AGM festival Match: గంగూలీ టీమ్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచిన జై షా టీమ్.. ఈడెన్ గార్డెన్‌లో మ్యాచ్

BCCI AGM festival Match: గంగూలీ టీమ్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచిన జై షా టీమ్.. ఈడెన్ గార్డెన్‌లో మ్యాచ్

బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌పై బీసీసీఐ సెక్రెటరీ ఎలెవెన్ గెలుపు.. (PC: CAB Cricket)

బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌పై బీసీసీఐ సెక్రెటరీ ఎలెవెన్ గెలుపు.. (PC: CAB Cricket)

BCCI AGM Festival Match: బీసీసీఏ సర్వసభ్య సమావేశం ఈ రోజు కోల్‌కతాలో జరుగున్నది. ఈ సందర్భంగా గత రాత్రి ఈడెన్ గార్డెన్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవెన్ - బీసీసీఐ సెక్రెటరీ ఎలెవెన్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో గంగూలీ జట్టుపై జై షా జట్టు ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

ఇంకా చదవండి ...

  బీసీసీఐ (BCCI) సర్వసభ్య సమావేశం (AGM) శనివారం కోల్‌కతాలో జరుగనున్నది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి బీసీసీఐ ఏజీఎం ఫెస్టివల్ మ్యాచ్ జరిగింది. బీసీసీఐ ప్రెసిండ్స్ ఎలెవన్ - బీసీసీఐ సెక్రటరీ ఎలెవెన్ మధ్య మ్యాచ్ నిర్వహించగా జై షా (Jay Shah) నేతృత్ంలోని సెక్రటరీ ఎలెవెన్ ఒక్క పరుగు తేడాతో గంగూలీ (Sourav Ganguly) కెప్టెన్‌గా ఉన్న ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌పై విజయం సాధించింది. ఏజీఎం ఫెస్టివెల్ మ్యాచ్‌ను చెరి 15 ఓవర్లుగా నిర్ణయించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బీసీసీఐ సెక్రటరీ ఎలెవెన్ జట్టులోని అరుణ్ దుమాల్ (Arun Dhumal), జయదేవ్ షా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ కలసి 92 పరుగులు జోడించారు. ప్రెసిడెంట్స్ ఎలెవెన్ నుంచి గంగూలీ, అజారుద్దీన్ కలసి కొత్త బంతితో బౌలింగ్ చేశారు. గంగూలీ తన బౌలింగ్ కోటాలో 19 పరుగులు ఇచ్చి ప్రనవ్ అమిన్ వికెట్ తీశాడు. ఇక మహ్మద్ అజారుద్దీన్ రెండు ఓవర్లు వేసిన కేవలం 8 పరుగులే ఇచ్చాడు. అయితే వికెట్లేమీ తీయలేకపోయాడు. మొత్తానికి బీసీసీఐ సెక్రటరీ ఎలెవన్ 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.

  ఇక 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌ను జై షా స్పిన్ బౌలింగ్‌తో నిరోధించాడు. ఈడెన్ గార్డెన్ ఫేవరెట్ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను రెండు పరుగులకే జై షా ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఇక ఆ తర్వాత గోవా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన సూరజ్ లాట్లికర్ వికెట్‌ను జై షా పడగొట్టాడు. మరోవైపు ఓపెనర్ గా వచ్చిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా 13 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.

  IND vs NZ: మయాంక్ అగర్వాల్ సెంచరీ వెనుక ఉన్న స్టోరీ తెలుసా? మ్యాచ్‌కు ముందు పలుమార్లు ఆ వీడియో చూశాడంటా..!


   ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరవ్ గంగూలీ తన ఆఫ్ సైడ్ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించాడు. కట్ షాట్లు, కవర్ డ్రైవ్‌లతో ధాటిగా ఆడాడు. 20 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ నిబంధపల ప్రకారం రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. చివర్లో మిగిలిన బ్యాటర్లు ప్రయత్నించినా లక్ష్యాన్ని చేరుకోలేదు. ప్రెసిడెంట్స్ ఎలెవెన్ నిర్ణీత 15 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సెక్రటరీ ఎలెవెన్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.  సంక్షిప్త స్కోర్లు:

  BCCI సెక్రటరీ-XI 15 ఓవర్లలో 3 వికెట్లకు 128 (జయదేవ్ షా రిటైర్డ్ 40, అరుణ్ ధుమాల్ 36, జే షా 10 నాటౌట్, సౌరవ్ గంగూలీ 1/19)

  BCCI ప్రెసిడెంట్-XI 5 ఓవర్లలో 5 వికెట్లకు 127 (సౌరవ్ గంగూలీ 35) రన్ రిటైర్డ్, అవిషేక్ దాల్మియా 13, జే షా 3/58)

  ఒక పరుగు తేడాతో బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌పై బీసీసీఐ సెక్రటరీ ఎలెవెన్ గెలుపు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:John Kora
  First published:

  Tags: Bcci, Cricket, Sourav Ganguly

  ఉత్తమ కథలు