హోమ్ /వార్తలు /క్రీడలు /

French Open : ఫ్రెంచ్ ఓపెన్‌లో బార్బోరా క్రెజికోవా సంచలన.. టైటిల్ గెలిచిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి

French Open : ఫ్రెంచ్ ఓపెన్‌లో బార్బోరా క్రెజికోవా సంచలన.. టైటిల్ గెలిచిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం సృష్టించిన బార్బోరా క్రెజికోవా

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం సృష్టించిన బార్బోరా క్రెజికోవా

చెక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా ఫ్రెంచ్ ఓపెన్‌లోసంచలనం సృష్టించింది. అన్ సీడెడ్ క్రీడాకారిణి టైటిల్ గెలవడం గత ఐదేళ్లలో ఇది మూడో సారి. చెక్ నుంచి ఈ టైటిల్ గెలిచిన రెండో టెన్నిస్ ప్లేయర్ క్రెజికోవా.

ఫ్రెంచ్ ఓపెన్ 2021లో (French Open)  సంచలనం నమోదయ్యింది. మహిళల సింగిల్స్ (Women's Singles) టైటిల్‌ను చెక్ రిపబ్లిక్‌కి చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా (Barbora Krejcikova) కైవసం చేసుకున్నది. శనివారం రాత్రి రోలాండ్ గారోస్‌లో (Roland Garros) జరిగిన ఫైనల్‌లో రష్యాకు చెందిన 31వ సీడ్ అనస్తాషియా పవ్లీచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన  క్రెజికోవా (25) కెరీర్‌లో ఇది 5వ టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరుసగా ఆరో సారి కొత్త క్రీడాకారిణి గెలవడం విశేషం. ఇందులో క్రెజికోవా మూడో అన్‌సీడెడ్ ప్లేయర్. 31వ సీడ్ పవ్లీచెంకోవాకు కూడా ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్. అయితే తొలి సెట్ కోల్పోయిన తర్వాత రెండో సెట్ గెలిచి ఆటలో పుంజుకున్నది. అయితే ఎడమ కాలి గాయం కారణంగా మూడో సెట్‌లో అసౌకర్యంగా కనిపించింది. క్రెజికోవా పలు అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్, డబుల్ ఫాల్ట్స్ చేసినా.. తన పవర్ గేమ్‌తో మూడో సెట్ గెలిచి సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది. చెక్ రిపబ్లిక్‌కి చెందిన హన మండ్లికోవా తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. ఫ్రెంచ్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో వరుసగా కొత్త ఛాంపియన్లు అవతరిస్తున్నారు. గార్బిన్ ముగురూజా, జెలేనా ఆస్తపెంకో, సిమోనా హెలెప్, ఆష్లీ బార్టీ, ఇగ స్వైటెక్ తర్వాత బార్బోరా క్రెజికోవా టైటిల్ నెగ్గింది.

క్రెజికోవాకు ఇది రోలాండ్ గారోస్‌లో మూడవ టైటిల్. అంతకు ముందు 2013లో బాలికల డబుల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. 2018లో మహిళల డబుల్స్ గెలిచిన క్రెజికోవా తాజాగా మహిళల సింగిల్స్ గెలిచి రికార్డు సృష్టించింది. ఆదివారం జరుగనున్న మహిళల డబుల్స్‌ ఫైనల్‌లో కూడా తలపడనున్నది. ఆ టైటిల్ కూడా గెలిస్తే 2000లో మేరీ పియర్స్ సాధించిన రికార్డును సమం చేయనున్నది. మేరీ పియర్స్ ఒకే ఏడాది సింగిల్స్, డబుల్స్ టైటిల్ గెలిచి రికార్డు సృష్టించింది. గత 21 ఏళ్లలో ఎవరూ ఆ రికార్డును సమం చేయలేకపోయారు. మరోవైపు రష్యా క్రీడాకారిణి పవ్లీచెంకోవా మూడో సెట్‌లో గాయం కారణంగా సరిగా ఆడేలేకపోయింది. పలుమార్లు ఛాంపియన్‌షిప్ పాయింట్‌ను అడ్డుకున్న పవ్లీచెంకోవా.. చివరిలో అనసవర తప్పిదాల కారణంగా మ్యాచ్‌ను చేజార్చుకుంది.


ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచినందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని క్రెజికోవా వ్యాఖ్యానించింది. తనకు చిన్నప్పుడు టెన్నిస్‌లో కోచింగ్ ఇచ్చిన జానా నొవాత్నా, గతంలో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన చెక్ క్రీడాకారిణి హన మండ్లికోవాకు ఈ టైటిల్ అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నది.

First published:

Tags: French open, Tennis

ఉత్తమ కథలు