ICC World Cup 2019 | బంగ్లాదేశ్ లక్ష్యం 322 పరుగులు...అదరగొట్టిన విండీస్ బ్యాట్స్‌మెన్...

Bangladesh vs West Indies Live Score, ICC World Cup Match in Taunton: వెస్టిండీస్, బంగ్లాదేశ్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 321/8 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ లలో హోప్ (90), ఎవిన్ లూయిస్ (70), హెట్‌మెయిర్(50) రాణించడంతో వెస్టిండీస్ బంగ్లా ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపింది.

news18-telugu
Updated: June 17, 2019, 7:19 PM IST
ICC World Cup 2019 | బంగ్లాదేశ్ లక్ష్యం 322 పరుగులు...అదరగొట్టిన విండీస్ బ్యాట్స్‌మెన్...
రాణించిన విండీస్ బ్యాట్స్‌మెన్...
news18-telugu
Updated: June 17, 2019, 7:19 PM IST
Bangladesh vs West Indies Live Score, ICC World Cup Match in Taunton: టాంటాన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్, బంగ్లాదేశ్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 321/8 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ లలో హోప్ (90), ఎవిన్ లూయిస్ (70), హెట్‌మెయిర్(50) రాణించడంతో వెస్టిండీస్ బంగ్లా ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపింది. చివరి ఓవర్లలో కెప్టెన్ జేసన్ హోల్డర్ 15 బంతుల్లో 33 పరుగులు చేయడంతో వెస్టిండీస్ స్కోరు 300 దాటింది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ అంతా కలిసి ఈ మ్యాచ్ లో 11 సిక్సర్లు బాదడం విశేషం. వెస్టిండీస్ బ్యాటింగ్ ఒక దశలో నెమ్మదిగా సాగింది. డ్రింక్స్ సమయానికి 32 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు 159 పరుగులు నమోదుకాగా, 35 ఓవర్ల నాటికి స్కోరు 200 దాటింది. నాలుగో వికెట్ కు హెట్‌మెయిర్, హోప్ 22 బంతుల్లో 51 పరుగులు జోడించడంతో స్కోరు బోర్డు వేగం పుంజుకుంది. 40 ఓవర్లలో స్కోరు బోర్డు 250 పరుగులు దాటింది. చివర్లో వరుసగా వికెట్లు పడటంతో వెస్టిండీస్ స్కోరు 321 పరుగుల వద్ద స్థిరపడింది.



First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...