ICC World Cup 2019 | గర్జించిన బంగ్లా బెబ్బులి...విండీస్ విధించిన 322 పరుగుల టార్గెట్ ఉఫ్...!

టాంటాన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ సునాయస విజయం సాధించింది. వెస్టిండీస్ విధించిన 322 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. షకీబ్ ఉల్ హసన్ మెరుపు సెంచరీతో విండీస్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు కనిపించాయి.

news18-telugu
Updated: June 17, 2019, 10:58 PM IST
ICC World Cup 2019 | గర్జించిన బంగ్లా బెబ్బులి...విండీస్ విధించిన 322 పరుగుల టార్గెట్ ఉఫ్...!
సెంచరీతో రాణించిన షకిబ్ ఉల్ హసన్
news18-telugu
Updated: June 17, 2019, 10:58 PM IST
Bangladesh vs West Indies Live Score, ICC World Cup Match in Taunton: టాంటాన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ సునాయస విజయం సాధించింది. వెస్టిండీస్ విధించిన 322 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. షకీబ్ ఉల్ హసన్ (124 నాటౌట్) మెరుపు సెంచరీతో విండీస్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు కనిపించాయి. ఫలితంగా కేవలం 41.3 ఓవర్లకే బంగ్లాదేశ్ 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్ మెన్ లో ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (48), సౌమ్య సర్కార్ (29) శుభారంభమివ్వగా, షకీబ్ ఉల్ హసన్, లిటన్ దాస్ లు భారీ భాగస్వామ్యంతో బంగ్లా దేశ్ కేవలం 3 వికెట్ల నష్టానికే 322 పరుగుల లక్ష్యాన్ని మరో 8 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. విండీస్ బౌలర్లపై షకీబ్ ఉల్ హసన్ వీరవిహారం చేయడంతో స్కోరు బోర్డు మెరుపు వేగంతో కదిలింది. 23 ఓవర్లకే బంగ్లాదేశ్ 150 పరుగులు చేయగా, 30 ఓవర్ల నాటికే బంగ్లా స్కోరు 200 దాటింది. 39 ఓవర్లకే బంగ్లాదేశ్ 300 స్కోరు దాటడం విశేషం.

ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 321/8 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ లలో హోప్ (90), ఎవిన్ లూయిస్ (70), హెట్‌మెయిర్(50) రాణించడంతో వెస్టిండీస్ బంగ్లా ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపింది. చివరి ఓవర్లలో కెప్టెన్ జేసన్ హోల్డర్ 15 బంతుల్లో 33 పరుగులు చేయడంతో వెస్టిండీస్ స్కోరు 300 దాటింది. వెస్టిండీస్ బ్యాటింగ్ ఒక దశలో నెమ్మదిగా సాగింది. డ్రింక్స్ సమయానికి 32 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు 159 పరుగులు నమోదుకాగా, 35 ఓవర్ల నాటికి స్కోరు 200 దాటింది. నాలుగో వికెట్ కు హెట్‌మెయిర్, హోప్ 22 బంతుల్లో 51 పరుగులు జోడించడంతో స్కోరు బోర్డు వేగం పుంజుకుంది. 40 ఓవర్లలో స్కోరు బోర్డు 250 పరుగులు దాటింది. చివర్లో వరుసగా వికెట్లు పడటంతో వెస్టిండీస్ స్కోరు 321 పరుగుల వద్ద స్థిరపడింది.
Loading...
First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...