ICC World Cup 2019: బంగ్లాదేశ్‌కు ఆఫ్గన్ పఠాన్ల సవాల్...రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా...

Bangladesh vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆఫ్గనిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభించిన 4 ఓవర్లోనే బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ (16) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు.

news18-telugu
Updated: June 24, 2019, 4:29 PM IST
ICC World Cup 2019: బంగ్లాదేశ్‌కు ఆఫ్గన్ పఠాన్ల సవాల్...రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా...
వికెట్ తీసిన ఆనందంలో ఆఫ్గన్ బౌలర్ నబి..
  • Share this:
Bangladesh vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: సౌతంప్టన్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆఫ్గనిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభించిన 4 ఓవర్లోనే బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ (16) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. దీంతో బ్యాటింగ్ భారం తమిమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్ పైనే పడింది. ప్రస్తుతం...17 ఓవర్లు ముగిసే నాటికి బంగ్లా దేశ్ స్కోు  ఇదిలా ఉంటే భారత్ పై సంచలన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన ఆఫ్గనిస్థాన్, ఎలాగైనా బంగ్లాదేశ్ ను సైతం మట్టి కరిపించి సంచలన విజయం నమోదు చేయాలని ఊవిళ్లూరుతోంది. కాగా ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్, మిగిలిన మూడు మ్యాచుల్లో భారీ విజయాలు నమోదు చేసి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలనే ఆశతో ఉంది. అయితే టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గన్ బౌలర్లు బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన కోహ్లీ సేనను కేవలం 225 పరుగులకే పరిమితం చేయడంతో, ఆ జట్టులో ఆత్మ విశ్వాసం తొణికసలాడుతోంది. అలాగే బంగ్లాదేశ్ కూడా గత మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో ఏకంగా 330 పరుగులు చేసి తమ బ్యాటింగ్ బలాన్ని నిరూపించుకోవడం విశేషం.



Published by: Krishna Adithya
First published: June 24, 2019, 4:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading