news18-telugu
Updated: October 21, 2019, 9:39 PM IST
బంగ్లా క్రికెట్ జట్టు (AP Photo/Eranga Jayawardena)
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, బంగ్లా క్రికెటర్ల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ముఖ్యంగా తాము బోర్డు ముందు ఉంచిన 11 డిమాండ్లను నెరవేర్చకుంటే దేశం తరపున క్రికెట్ ఆడమని బంగ్లాదేశ్ క్రికెటర్లు భీష్మించుకొని కూర్చుకున్నారు.ఈ మేరకు బోర్డు నిరంకుశ వైఖరితో బంగ్లాదేశ్ క్రికెట్ ప్రమాదంలో పడిందని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆడే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ టీమ్ కెప్టెన్ షకీబల్ హసన్ ఇప్పటికే తేల్చి చెప్పాడు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించడం అనుమానంగా మారింది. నవంబరు 3 నుంచి 26 వరకు బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించాల్సింది ఉంది. ఇందులో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20లు, రెండు టెస్టులు జరగనున్నాయి. అయితే, ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Published by:
Krishna Adithya
First published:
October 21, 2019, 9:39 PM IST