BANGLADESH BATSMAN TAIJUL ISLAM BIZZARE DISMISSAL GOES VIRAL IN SOCIAL MEDIA HERE WATCH SRD
Viral Video : ఇదేందయ్యా..ఇది..నేనాడా సూడలే..షూ వల్ల ఔటైన క్రికెటర్..క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం..
Photo Credit : Instagram
Viral Video : దరిద్రం పక్కన పెట్టుకుంటే ఎవరైనా ఏమి చేయగలరు. క్రికెట్ లో అప్పుడప్పుడూ అనుకోని విధంగా బ్యాట్స్ మన్ పెవిలియన్ కు చేరుతుంటారు. ఇక్కడ బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ ఔటైన తీరు చూస్తే అయ్యో పాపం అంటూనే.. నవ్వులు చిందించవచ్చు.
అప్పుడప్పుడూ క్రికెట్లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాగే, ఫన్నీ ఔట్లు కూడా జరుగుతూ.. నవ్వులు తెప్పిస్తుంటాయ్. ముఖ్యంగా హిట్ వికెట్ రూపంలో దక్కే వికెట్లు ఎప్పుడూ ఫన్నీగానే ఉంటాయ్. అ హిట్ వికెట్ అయిన బ్యాట్స్‌మన్ అదుపుతప్పడంతో ఔట్ అవుతుంటాడు. అయితే 'షూ' కారణంగా ఔట్ అవ్వడం బహుశా క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చు. లేటెస్ట్ గా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ ఈ ఘటనకు వేదికైంది. పల్లెకెల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ (రెండో టెస్ట్) జరిగింది. రెండో టెస్టులో 3వ రోజు బంగ్లా 251 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అప్పటికి లంక మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు బంగ్లా 242 పరుగుల వెనుకబడి ఉంది. సురంగ లక్మల్ వేసిన 82వ ఓవర్ చివరి బంతికి తైజుల్ ఇస్లాం స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. లక్మల్ బంతి వేయగానే ఇస్లాం మామూలుగానే బ్యాక్ ఫుట్ తీసుకుని.. డిఫెన్సివ్ షాట్ ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన ఇస్లాం ఎడమ కాలి షూ ఓడిపోవడంతో.. కాలు అదుపుతప్పి వికెట్లను తాకింది. ఇంకేముంది ఇస్లాం హిట్ వికెట్ ఔట్ అయ్యాడు.
తైజుల్ ఇస్లాం షాట్ ఆడిన అనంతరం సింగల్ కోసం ప్రయత్నించాడు. అయితే లంక ఆటగాళ్లు హిట్ వికెట్ అవ్వడంతో బంతి కోసం వెళ్ళలేదు. ఇది చూసిన ఇస్లాం హిట్ వికెట్ అయ్యానని గ్రహించి షూ వేసుకుని పెవిలియన్ చేరాడు. ఇస్లాం 50 బంతుల్లో 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన ఫాన్స్ నవ్వులతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'అన్ లక్కీ ఔట్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇలా ఔట్ అవ్వడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి' అని ఇంకొకరు అన్నారు.
ఇక, రెండో టెస్టులో శ్రీలంక 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన లంక మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లను 493 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు కరుణ రత్నే (118), తిరిమన్నే (140) సెంచరీలు చేయగా.. ఫెర్నాండో (81), డిక్ వెళ్లా (77) హాఫ్ సెంచరీలు చేశారు. మొడటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 251 పరుగులకే ఆలౌట్ అయింది. లక్మల్ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో లంక 9 వికెట్లకు 194 రన్స్ వద్ద మరోసారి డిక్లేర్ చేసింది. 400లకు పైగా ఛేదనలో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంక ఘన విజయం సాధించింది. మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ ను 1-0 తో దక్కించుకుంది శ్రీలంక టీమ్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.