BAN VS WI 1ST TEST LIVE SCORES BANGLADESH BUNDLED OUT WITH SIX TEST DUCKS AGAIN SJN
Bangladesh : మీరు పులులు కాదు.. పిల్లులు.. పరమ చెత్త రికార్డును సొంతం చేసుకున్న నాగినీ టీం
(PC : TWITTER)
Bangladesh : పసికూనగా క్రికెట్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు (Bangladesh)) ఒక్కో మెట్టు ఎక్కుతూ తమ ఆటను మెరుగుపురుచుకున్న సంగతి తెలిసిందే. టాప్ టీంలకు సైతం షాకిచ్చిన ఘనత బంగ్లాదేశ్ కే చెందుతుంది. 2007 వన్డే ప్రపంచకప్ ను భారత అభిమానులు అంత త్వరగా మర్చిపోరు.
Bangladesh : పసికూనగా క్రికెట్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు (Bangladesh)) ఒక్కో మెట్టు ఎక్కుతూ తమ ఆటను మెరుగుపురుచుకున్న సంగతి తెలిసిందే. టాప్ టీంలకు సైతం షాకిచ్చిన ఘనత బంగ్లాదేశ్ కే చెందుతుంది. 2007 వన్డే ప్రపంచకప్ ను భారత అభిమానులు అంత త్వరగా మర్చిపోరు. లీగ్ దశలో భారత్ (India)ను బంగ్లాదేశ్ ఓడించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అనంతరం శ్రీలంక చేతిలోనూ ఓడిపోయిన టీమిండియా ఆ ప్రపంచకప్ ను గ్రూప్ దశతోనే ముగిస్తుంది. ఫలితంగా భారతీయులకు 2007 వన్డే ప్రపంచకప్ చేదు జ్ఞాపకంగా మిగిలింది. అయితే విజయాలను బాగా నెత్తికెక్కించుకున్న బంగ్లాదేశ్ జట్టు.. ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం మొదలు పెట్టింది. గెలిచిన ప్రతిసారి నాగిని డ్యాన్స్ చేస్తూ అవతలి టీం ఫ్యాన్స్ ను ప్లేయర్లను హేళన చేస్తుంది.
అయితే తాజాగా బంగ్లాదేశ్ పరమ చెత్త రికార్డును నమోదు చేసింది. వెస్టిండీస్ తో జరుగుతోన్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 103 పరుగులకు ఆలౌటైంది. ఇందులో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ గా వెనుదిరగడం విశేషం. బంగ్లాదేశ్ ఈ టెస్టు మ్యాచ్ కంటే కూడా ముందు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడింది. అందులో భాగంగా జరిగిన చివరి టెస్టులోనూ ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ లుగా వెనుదిరిగారు. ఫలితంగా వరుసగా రెండు టెస్టు మ్యాచ్ ల్లో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ కు చెందిన ఆరుగురు బ్యాటర్లు డకౌట్లుగా వెనుదిరిగి పరమ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ఓవరాల్ గా ఇలా ఒకే ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ లు కావడం బంగ్లా టీం చరిత్రలో ఇది మూడోసారి కావడం విశేషం.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 265 పరుగలుకు ఆలౌటైంది. తద్వారా 162 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లకు 50 పరుగులు చేసింది. ప్రస్తుతం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 112 పరుగులు వెనుకబడి ఉంది. బంగ్లా జట్టు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే మరో 112 పరుగులు చేయాల్సి ఉంది.. లేదంటే ఇన్నింగ్స్ పరాభవాన్ని మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హసన్ జాయ్ (18 బ్యాటింగ్; 2 ఫోర్లు), నజ్ముల్ (8 బ్యాటింగ్; ఫోర్) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.