Ban Vs Nz : నిన్న ఆస్ట్రేలియా.. ఇవాళ న్యూజిలాండ్.. బంగ్లా గర్జనకు కుదేలవుతున్న టాప్ టీమ్స్..

Photo Credit : Twitter

Ban Vs Nz : టీ-20 (T-20 Cricket)ల్లో బంగ్లాదేశ్ (Bangladesh) దుమ్మురేపుతోంది. తమ మీద ఉన్న పసికూన ట్యాగ్ ను చెరిపేస్తూ.. ధనాధన్ ఫార్మాట్ లో రెచ్చిపోతోంది.

  • Share this:
    టీ-20 (T-20 Cricket)ల్లో బంగ్లాదేశ్ (Bangladesh) దుమ్మురేపుతోంది. తమ మీద ఉన్న పసికూన ట్యాగ్ ను చెరిపేస్తూ.. ధనాధన్ ఫార్మాట్ లో రెచ్చిపోతోంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా (Australia) లాంటి టీమ్ ను చిత్తు చేసిన బంగ్లా పులులు.. ఇప్పుడు న్యూజిలాండ్ (New Zealand) టీమ్ కు చుక్కలు చూపుతున్నారు. బంగ్లా దెబ్బకి కివీస్ లాంటి స్ట్రాంగ్ టీమ్ దగ్గర ఎటువంటి సమాధానం లేకపోయింది. టీ20ల్లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి టీ20లో న్యూజిలాండ్‌ను 60 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లా, రెండో టీ20లో న్యూజిలాండ్‌ను స్వల్ప లక్ష్యఛేదనలో నిలువరించి... 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నయీమ్ 39 పరుగులు, లిటన్ దాస్ 33, మహ్మదుల్లా 32 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసి రాణించారు.

    142 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు, 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. చేతిలో ఐదు వికెట్లు ఉన్నా, న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ 65 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నా... కివీస్‌కి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో 49 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 పరుగులు చేసిన టామ్ లాథమ్ నాటౌట్‌గా నిలిచి కివీస్‌ని లక్ష్యానికి దగ్గరగా తేగలిగాడు.

    ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సిన దశలో ముస్తఫిజిర్ రహ్మాన్ మొదటి ఐదు బంతుల్లో 14 పరుగులు ఇచ్చినా... ఆఖరి బంతికి సిక్సర్ కావాల్సిన దశలో సింగిల్ మాత్రమే తీయగలిగాడు టామ్ లాథమ్. వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో గెలిచిన న్యూజిలాండ్, 2-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లాదేశ్‌ స్వదేశంలో ఆడిన గత 11 మ్యాచుల్లో 10 మ్యాచుల్లో విజయం సాధించి, ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడడం విశేషం.

    ఇది కూడా చదవండి :  నీ దూకుడు సాటెవ్వడూ.. ఆసియాలోనే ఎవ్వరికీ సాధ్యంకాని ఫీట్‌ కోహ్లీ సొంతం..

    2021 సీజన్‌లో బంగ్లాదేశ్‌కి టీ20ల్లో 8వ విజయం, పాకిస్తాన్ మాత్రమే 9 విజయాలతో టాప్‌లో ఉంది... న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటిదాకా 12 మ్యాచులు జరగగా... కివీస్‌ మొదటి 10 మ్యాచుల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కి ఇది వరుసగా రెండో విజయం. ఇక, అంతకు ముందు జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 16.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. షకీబ్‌ (2/10), ముస్తఫిజుర్‌ (3/13), నాసుమ్‌ అహ్మద్‌ (2/5), సైఫుద్దీన్‌ (2/7) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు.

    ఇది కూడా చదవండి :  కోచ్ పై మనికా బాత్రా సంచలన ఆరోపణలు.. అతను అలా చేయమన్నడంటూ..

    టి20ల్లో న్యూజిలాండ్‌కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లా టీంలో ముస్తిఫర్ రహీమ్ 16, మహ్మదుల్లా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరో వికెట్ పడకుండా విజయం సాధించారు. కాగా ఈ సిరీస్ కోసం, న్యూజిలాండ్ జట్టు 10 మంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది.
    Published by:Sridhar Reddy
    First published: