హోమ్ /వార్తలు /క్రీడలు /

Balakrishna - Hockey Team : హాకీలో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు బాలయ్య సహా టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు..

Balakrishna - Hockey Team : హాకీలో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు బాలయ్య సహా టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు..

భారత హాకీ జట్టుపై బాలయ్య సహా పలువురు ప్రశంసలు (Facebook/Photo)

భారత హాకీ జట్టుపై బాలయ్య సహా పలువురు ప్రశంసలు (Facebook/Photo)

హాకీలో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు బాలయ్య సహా టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

హాకీలో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు బాలయ్య సహా టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత మన దేశం కాంస్య పతకంపై గెలివడంపై భారత హాకీ టీమ్ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ హీరోలు సోషల్ మీడియా వేదికగా హాకీ జట్టుకు శుభాభినందలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ అగ్ర నటుడు హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు కాంస్య పతకం గెలవడం సంతోషకరం అన్నారు. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో హాకీ తరుపున మనం కాంస్య పతకం గెలవడం వెనక క్రీడాకారుల కృషి ఎంతో ఉందన్నారు. పతకం సాధించి పెట్టిన దేశ ప్రతిష్టను చాటి చెప్పిన క్రీడాకారులకు మనస్పూర్తిగా శుభాభినందనలు తెలియజేసారు.

ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆశీస్సులు, మన్ననలు క్రీడాకారులకు ఎల్లవేళల ఉంటాయన్నారు. దేశం గర్వించేలా మన క్రీడాకారులు పోరాడుతున్నారు. అంతేకాదు ఒలింపిక్స్‌లో ఇతర క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఒలింపిక్స్‌లో హాకీలో కాంస్య పతకం సాధించిన క్రీడాకారులకు సీనియర్ వెంకటేష్ కూడా శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇప్పటికే తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్‌లో పీవీ సింధు బాట్మింటన్‌లో కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే కదా.

హాకీ విషయానికొస్తే.. హాకీ భారతదేశపు జాతీయ క్రీడ. ఈ విషయం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లోనే చదివాం. అయితే ప్రస్తుతం దేశంలో ఫుట్‌బాల్ లేదా క్రికెట్‌కు ఉన్న ఆదరాభిమానాలు హాకీకు దక్కడం లేదు. హాకీ క్రీడ ఒకప్పుడు భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటగా గుర్తింపు ఉంది. కానీ కాలక్రమంలో హాకీ అంటేనే మరుగున పడే స్థితికి చేరుకుంది. హాకీ ( Hockey ).. మ‌న దేశ జాతీయ క్రీడ‌. ఈ మాట చెప్పుకోవ‌డానికే త‌ప్ప ఎన్న‌డూ ఈ ఆట‌కు అంత‌టి ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. గ‌త‌మెంతో ఘ‌న‌మైనా కొన్ని ద‌శాబ్దాలుగా హాకీలో మ‌న ఇండియ‌న్ టీమ్ ఆట దారుణంగా ప‌త‌న‌మ‌వుతూ వ‌చ్చింది. ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడ‌ల్స్ గెలిచిన చ‌రిత్ర ఉన్నా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు క‌నీసం అర్హ‌త సాధించ‌లేక చ‌తికిల‌ప‌డింది. అలాంటి ప‌రిస్థితుల నుంచి ఇప్పుడు మ‌ళ్లీ అదే ఒలింపిక్స్‌లో మెడ‌ల్ గెలిచే స్థాయికి చేరింది. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో పతకం గెలిచి చరిత్ర సృష్టించింది.


ఇవి కూడా చదవండి 

Cheran : సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. రవితేజ దర్శకుడికి తీవ్ర గాయాలు..

HBD Kajol : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆర్ఆర్ఆర్ హీరో భార్య కాజోల్ దేవ్‌గణ్ గురించి ఈ నిజాలు తెలుసా..

Suma Kanakala - Rajeev : వివాదంలో సుమ, రాజీవ్ కనకాల దంపతులు..

First published:

Tags: Balakrishna, Hockey, Sports, Tokyo Olympics, Tollywood, Venkatesh

ఉత్తమ కథలు