బజరంగ్ పూనియాకు మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ భరోసా

రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్‌ ప్రకటించడానికి ఏయే అంశాలను పరినణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారో తనకు తెలియజెప్పాలని భారత రెజ్లర్ బజరింగ్ పూనియా మండిపడుతున్నాడు.

news18-telugu
Updated: September 21, 2018, 1:36 PM IST
బజరంగ్ పూనియాకు మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ భరోసా
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బజరంగ్ పూనియా ( Rajyavardhan Rathore / twitter )
  • Share this:
భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం తనకు దక్కకపోవడంతో బజరంగ్ పూనియా పోరాటం చేస్తున్నాడు. ఖేల్ రత్న అవార్డ్ దక్కనందుకు తనకేమాత్రం బాధ లేదని...ఎంపిక చేసిన విధానాన్ని పూనియా ప్రశ్నిస్తున్నాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో పాటు వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చానుకి కేంద్ర ప్రభుత్వం ఖేల్‌రత్న పురస్కారం ప్రకటించింది. ఈ అవార్డ్ రేస్‌లో నిలిచిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు మిగతా వారందరికంటే మెరుగైన పాయింట్స్ వచ్చినా పురస్కారం దక్కలేదు."నా ప్రతిభ, ప్రదర్శనకు గుర్తింపు దక్కనందుకు నేను బాధపడట్లేదు, అవార్డ్‌ ప్రకటించడానికి ఏయే అంశాలను పరినణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారో నాకు అర్ధం కావట్లేదు." అని పూనియా వాపోయాడు.

ఇదే అంశంపై భారత స్పోర్ట్స్ మినిస్టర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్‌ను కలుసుకున్నారు."నేను ఈ రోజున మంత్రిని కలుసుకోవాల్సి వచ్చింది. ఖేల్ రత్న కోసం నన్ను పరిగణించని కారణమేంటని నేను మంత్రిని అడిగాను. నామినేట్ చేయబడిన ఇద్దరు (విరాట్ కోహ్లి మరియు మీరాబాయి చాను) కంటే ఎక్కువ పాయింట్లను నేను సంపాదించాను, "అని బజరంగ్ తెలిపాడు.

కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలలో స్వర్ణ పతకాలు సాధించిన 24 ఏళ్ల బజరంగ్ , సాయంత్రానికి తనకు న్యాయం జరగకపోతే కోర్టు తలుపులు తట్టుకోవలసి వస్తుందని వారించాడు."నాకు అన్యాయం జరిగింది. నాకు న్యాయం కావాలి, మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ఈ విషయాన్ని పరిశీలిస్తారని నాకు హామీ ఇచ్చారు. సాయంత్రంలోపు అనుకూలమైన ప్రత్యుత్తరం రాకపోతే నేను రేపు కోర్టుకు వెళ్తాను" అని బజరంగ్ తేల్చిచెప్పాడు.

ఒలింపిక్ క్రీడ కానటువంటి క్రికెట్‌లో ఎన్ని ఘనతలు సాధించినా...ఆసియా గేమ్స్, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులు, అథ్లెట్లకే..ఖేల్ రత్న ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ మార్క్స్ స్కీమ్ ప్రకారం ఎటువంటి పాయింట్స్ రాని విరాట్‌కు అవార్డ్ ప్రకటించడంతో బజరంగ్ పూనియా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు..2018 ఆసియా గేమ్స్‌‌లో బంగారు పతకాలు సాధించి భారత దేశానికే గర్వకారణంగా నిలిచాడు.2014 కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు,2014 ఆసియా క్రీడల్లోనూ బజరంగ్ రజత పతకాలు సాధించాడు. ఇదిలా ఉంటే ఒక్కసారి అవార్డ్‌లు ప్రకటించిన తర్వాత..క్రీడా శాఖ మంత్రికి అవార్డ్ విజేతల జాబితాను చివరి నిమిషంలో మార్చే అవకాశముండదని సమాచారం.ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, ద్యాన్ చంద్ అవార్డ్‌ విజేతలు సెప్టెంబర్ 25న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాలు అందుకోనున్నారు.
Published by: Prasanth P
First published: September 21, 2018, 1:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading