ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్ కలర్ఫుల్గా జరిగింది. ఈ షోలో హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్స్ వీపీ సింధు, సైనా నేహ్వాల్ సందడి చేశారు. ర్యాంప్‌పై హొయలుపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగుపు రంగు గౌనులో సింధు మెరవగా...తెలుపురంగు లెహెంగాలో సైనా తళుక్కుమంది. వీరితో పాటు రెజ్లర్ గీతా ఫొగట్ సైతం ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. పలు ఫ్యాషన్ డిజైనర్లకు షో స్టాపర్స్‌గా వ్యవహరించారు ఈ ముగ్గురు క్రీడాకారిణులు. సింధులు లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.
1999 నుంచి ప్రతి ఏటా ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్ జరుగుతోంది. ఐఎంజీ రిలయన్స్ లిమిటెడ్, లాక్మే సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భారత్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్లతో పాటు అంతర్జాతీయ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ఈ షోలో ప్రదర్శిస్తారు. ఏడాదికి రెండు సార్లు ఈ వేడుక నిర్వహిస్తారు. శీతకాలంలో ఒకసారి, వేసవి కాలంలో మరోసారి లాక్మే ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తారు. బాలీవుడ్, స్పోర్ట్స్ స్టార్స్ అదిరేటి డ్రెస్సులు ధరించి ఫ్యాషన్ షోలో సందడి చేస్తారు.
లాక్మే ఫ్యాషన్ వీక్‌కు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రణ్వీర్తో సెల్ఫీ దిగింది పీవీ సింధు. ఆ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసి.. గల్లీబాయ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది ఈ బ్యాడ్మింటన్ స్టార్. రణ్వీర్ నటించిన ‘గల్లీ బాయ్’ ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Published by:Shiva Kumar Addula
First published:February 05, 2019, 16:13 IST