హోమ్ /వార్తలు /క్రీడలు /

sports: విష్ణుతో పెళ్లి ఎప్పుడనే ప్రశ్నకు గుత్తా జ్వాలా ఇంట్రస్టింగ్ కామెంట్స్

sports: విష్ణుతో పెళ్లి ఎప్పుడనే ప్రశ్నకు గుత్తా జ్వాలా ఇంట్రస్టింగ్ కామెంట్స్

బ్యాడ్మింటన్ బ్యూటీ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా..? విష్ణు అందుకు సిద్ధంగా ఉన్నాడా..? విష్ణుతో జ్వాలకు సమస్యలు ఉన్నాయా..? ఇలా చాలా విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు గుత్తా జ్వాల.

బ్యాడ్మింటన్ బ్యూటీ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా..? విష్ణు అందుకు సిద్ధంగా ఉన్నాడా..? విష్ణుతో జ్వాలకు సమస్యలు ఉన్నాయా..? ఇలా చాలా విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు గుత్తా జ్వాల.

బ్యాడ్మింటన్ బ్యూటీ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా..? విష్ణు అందుకు సిద్ధంగా ఉన్నాడా..? విష్ణుతో జ్వాలకు సమస్యలు ఉన్నాయా..? ఇలా చాలా విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు గుత్తా జ్వాల.

  బ్యాడ్మింటన్ బ్యూటీ,  ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాలా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఐదు నెలల ముందే ఆమె  ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. కానీ ఇప్పటి వరకు పెళ్లి బాజా మోగలేదు. దీంతో జ్వాల పెళ్లెప్పుడు అని ఆమె ఫ్యాన్స్.. స్పోర్ట్స్ లవర్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. సోషల్ మీడియాలో

  పోస్టులు చేస్తున్నారు కూడా. ఆ ఎదురు చూపులకు ఆమె తెరదించారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు.  అంతేకాదు విష్ణు గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. .

  గత కొన్ని నెలలుగా కోలీవుడ్ నటుడు ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్‌ లు ప్రేమలో ఉన్నారు. ఇటీవల జ్వాల పుట్టిన రోజు సందర్భంగా ఆమె చేతికి రింగ్ తొడిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రేమ జంట వివాహం ఎప్పుడు అన్నది హాట్ టాపిక్ అయ్యింది. ఇదే విషయంపై ఓ ఛానెల్ కు ఇచ్చిన  ఇంట్వర్వ్యూలో జ్వాల స్పష్టం చేశారు. త్వరలోనే తాము పెళ్లి చేసుకోబుతున్నామని.. అందరికి ఆ న్యూస్ అధికారికంగా చెబుతాను అంటున్నారు. ఇంకా ఆలస్యం చేయాలి అనుకోవడం లేదని స్పష్టత ఇచ్చారు. అలాగే విష్ణు ఎలాంటి వాడు.. తనతో లైఫ్ ఎలా ఉంటుంది అన్న విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. విష్ణుది తనది ఒకే మనస్తత్వం అన్నారు.  ముక్కుసూటిగా  ఉండడం వలనే తనను కొంతమంది ఇష్టపడకపోవచ్చన్నారు. విష్ణు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని.. ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అన్నారు. ఇద్దరి భావాలు ఒకేలా ఉండడంతోనే ఒకరికి ఒకరు దగ్గర అయ్యామన్నారు. తన జీవితంలో అత్యంత నమ్మకస్తులుగా భావించేవారిలో విష్ణు ఒకడు అన్నారు. అయితే విష్ణు మనసులో ఏదీ దాచుకోలేడని.. ఏ విషయం తనకు తెలిసినా దాన్ని కచ్చితంగా షేర్ చేసుకుండా ఉండాలేడని.. అది మాత్రం సమస్యే అవుతుంది అన్నారు జ్వాల.

  అయితే ఈ జంట ఇద్దరికి ఇది రెండో వివాహమే అవుతుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన చేతన్ ఆనంద్‌ని 2005లో గుత్తా జ్వాల పెళ్లాడారు. ఆ తరువాత 2011లో వీరిద్దరు విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి జ్వాల సింగిల్‌గా ఉన్నారు. మరోవైపు 2010లో రజనీ నటరాజ్‌ని వివాహమాడిన విష్ణు విశాల్‌, 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఆర్యన్ అనే కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతడు విశాల్ సంరక్షణలో ఉన్నారు. మరోవైపు కెరీర్ విషయాల్లోకి వెళ్తే, గుత్తా జ్వాల బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభించగా.. విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

  ఇటీవలే జ్వాలా గుత్తా అకాడ‌మీ ఆఫ్ ఎక్స‌లెన్సీని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని మొయినాబాద్ లో ఈ అకాడమీ ఉంది. అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యం అంటోంది జ్వాల.. ప్రభుత్వ సహకారం కూడా ఉంటే అనుకున్న లక్ష్యాలను అందుకోవచ్చని చెప్పారు జ్వాల ..గుత్తా

  First published:

  Tags: Badminton, Gutta Jwala, Vishnu Vishal

  ఉత్తమ కథలు