• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • BADMINTON BAI NAMES FULL STRENGTH SQUAD SINDHU SAINA TO COMPETE FOR FIRST TIME SINCE VIRUS BREAK SRD

Badminton : కరోనా ఎఫెక్ట్ తర్వాత.. మళ్లీ బ్యాడ్మింటన్ కోర్టులోకి భారత స్టార్ ప్లేయర్స్

Sindhu-Saina (పైల్ ఫోటో)

Badminton : బ్యాడ్మింటన్‌ అభిమానులకు గుడ్ న్యూస్. భారత టాప్ ప్లేయర్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌ తిరిగి రాకెట్‌ పట్టుకోనున్నారు. త్వరలో జరిగే మూడు టోర్నీల్లో వారు పోటీ పడనున్నారు. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌, బ్యాంకాక్‌ ఓపెన్‌ సైతం అందులో ఉన్నాయ్.

  • Share this:
    బ్యాడ్మింటన్‌ అభిమానులకు గుడ్ న్యూస్. భారత టాప్ ప్లేయర్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌ తిరిగి రాకెట్‌ పట్టుకోనున్నారు. త్వరలో జరిగే మూడు టోర్నీల్లో వారు పోటీ పడనున్నారు. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌, బ్యాంకాక్‌ ఓపెన్‌ సైతం అందులో ఉన్నాయ్. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని భారత బ్యాడ్మింటన్‌ సంఘం ఎనిమిది మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. గత ఒలింపిక్స్‌ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, బి.సాయి ప్రణీత్‌, కిడాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి, అశ్విని పొన్నప్ప, ఎన్‌.సిక్కిరెడ్డి ఈ జట్టులో ఉన్నారు. జనవరి 12-17 మధ్య జరిగే థాయిలాండ్‌ ఓపెన్‌తో వీరు తమ ప్రస్థానాన్ని తిరిగి ఆరంభిస్తారు. ఆ తర్వాత బ్యాంకాక్‌ ఓపెన్‌ (జనవరి 19-24), బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ (జనవరి 27-31)లో పోటీపడతారు. వీరితో పాటు వ్యక్తిగత కోచ్‌లు, ఫిట్‌నెస్‌ ట్రైనర్లూ అక్కడికి వెళ్లనున్నారు.

    కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఈ ఏడాది మార్చి నుంచి బ్యాడ్మింటన్‌ టోర్నీలన్నీ రద్దు లేదా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎక్కడైనా ఒక టోర్నీ జరిగినా ఆటగాళ్లే రిస్క్‌ చేసి వెళ్లారు. భారత్‌ నుంచి కేవలం కిదాంబి శ్రీకాంత్‌ ఒక్కడే అక్టోబర్లో డెన్మార్క్‌ ఓపెన్‌లో తలపడ్డాడు.

    ‘మళ్లీ బ్యాడ్మింటన్‌ సందడి మొదలవ్వడం ఆనందంగా ఉంది. సమీప భవిష్యత్తులో టోర్నీలు వరుసగా జరుగుతాయన్న నమ్మకం కలుగుతోంది. 7-8 నెలలుగా మా క్రీడాకారుల్లో చాలామంది ఏ టోర్నీల్లో పాల్గొనలేదు. అయితే శిబిరాల్లో మాత్రం శిక్షణ పొందుతున్నారు. ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు ముందు సాధన లభిస్తుందనే పూర్తి జట్టును పంపిస్తున్నాం’ అని బాయ్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ సింఘానియా అన్నారు.
    Published by:Sridhar Reddy
    First published: