టీ20 (T20 Cricket) అంటేనే పరుగుల పండుగ. ఈ ఫార్మాట్ వచ్చినాక.. బ్యాటర్ల దూకుడుకు బౌలర్లు బలైపోతున్నారు. టీ20 ఫార్మాట్ అంటేనే సిక్సర్ లా వర్షం కురిసే తుఫాన్ అని ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు.ఎందుకంటే ఛాన్స్ దొరికిన దొరకకపోయినా ప్రతి ఆటగాడు బంతిని బౌండరీకి తరలించడమే తన లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తాడు. ఇక, ఈ పొట్టి క్రికెట్ లో మరో పరుగుల సునామీ అభిమానుల్ని ఫిదా చేసింది. ఓ యువ బ్యాటర్ టీ20 లీగ్‌లో బౌలర్లను చితకబాది, బీభత్సం చేశాడు. బౌలర్లపై కనికరం చూపకుండా.. ఎడాపెడా బౌండరీలు కొట్టేస్తూ.. ఓ విధ్వంసాన్ని సృష్టించాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. బేబీ ఏబీ డివిలియర్స్ అని ముద్దుగా పిలుచుకునే సౌతాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రేవిస్ (Dewald Brevis).
ఇప్పుడు ఈ నునుగు మీసాల కుర్రాడు సంచలన ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచాడు. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో బ్రేవిస్ 57 బంతుల్లోనే 162 పరుగులు పరుగులు చేశాడు. టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన బేబీ ఏబీ.. టీ20ల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరును సమం చేశాడు. బేబీ ఏబీ ఈ మ్యాచ్‌లో 13 ఫోర్లు, 13 సిక్సులు బాదడం విశేషం.టైటాన్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రేవిస్.. నైట్స్‌పై 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ యువ బ్యాటర్.. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు.
టీ20ల్లో మూడో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా.. హజ్రతుల్లా జజాయ్, హమిల్టన్ మసకద్జ సరసన బ్రేవిస్ నిలిచాడు. 19.3వ ఓవర్లో ఔటైన బ్రేవిస్..13 పరుగుల తేడాతో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రిస్ గేల్ (175) రికార్డును సమం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ టీ20ల చరిత్రలో ఫాస్టెస్ట్ 150ని నమోదు చేశాడు. దీంతో టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. బదులుగా నైట్స్ 9 వికెట్ల నష్టానికి 230 రన్స్ చేసింది.
We’ve seen special T20 knocks, very few better than this one from Dewald Brevis - 100* off 35 balls ???? ???????????????????????? ???????????????? ????????????????????????????????! ????#CSAT20Challenge pic.twitter.com/F5Y5fc27D9
— SuperSport ???? (@SuperSportTV) October 31, 2022
Dewald Brevis is a ???????????? ????????????????! ????#CSAT20Challenge pic.twitter.com/Y1iuRV4up6
— SuperSport ???? (@SuperSportTV) October 31, 2022
19 ఏళ్ల బ్రేవిస్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్లో ముంబై తరఫున బరిలోకి దిగిన బ్రేవిస్.. తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇప్పుడు టీ20ల్లో తొలి సెంచరీతోనే మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ సెన్సేషన్, దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ దేవల్ద్ బ్రేవిస్‌ను రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. గతేడాది కరేబియన్ గడ్డపై జరిగిన అండర్ -19 వరల్డ్ కప్ లో 500కు పైగా పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Mumbai Indians, South Africa, T20