కుస్తీ పోటీల్లో శిక్షణ సమయంలో తాము అబ్బాయిలతో కుస్తీ పోటీల్లో పాల్గొన్నట్లు ప్రముఖ రెజ్లర్ బబిత కుమారి ఫొగాట్ తెలిపారు. ఈ మేరకు సినిమాలో చూపించిన సన్నివేశాలు నిజమేనని ఆమె స్పష్టంచేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగానే తాము ఈ స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. రెజ్లర్ అయ్యేందుకు తమ తండ్రి స్ఫూర్తి ఇచ్చారని తెలిపారు. ఆదివారాలు, సెలవుదినాలు అని తేడా లేకుండా ప్రాక్టీస్ చేసినట్లు వివరించారు. కొన్ని సందర్భాల్లో ఏడుపు వచ్చేదని గుర్తుచేసుకున్నారు.
అయితే రెండేళ్లు కష్టపడితే, ఆ తర్వాత మీకు సంతోషంగా ఉండొచ్చని అమ్మ ప్రోత్సహించేదన్నారు. అమ్మ చెప్పిన మరో రెండేళ్లు అన్న మాటే తమను ఈ స్థాయికి తీసుకొచ్చిందని తెలిపారు. అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల అండ ఎంతో అవసరమన్నారు. ఆ రెండూ ఉంటూ ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా అనుకున్నది సాధించగలరని బబిత కుమారి ఫొగాట్ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.