పాకిస్తాన్ కెప్టెన్ (Pakistan Captain) బాబర్ అజమ్ (Babar Azam) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings)అగ్రస్థానానికి చేరుకున్నాడు. చాలా వారాలుగా వన్డే ర్యాంకింగ్‌లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ విరాట్ కోహ్లీని (Virat Kohli) దాటేసి బాబర్ ముందుకెళ్లాడు. దీంతో కోహ్లీ రెండో ర్యాంకుకు పడిపోయాడు. బాబర్ అజమ్ 865 రేటింగ్ పాయింట్లలో నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకోగా.. కోహ్లీ 857 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 825 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 2017 అక్టోబర్ నుంచి 2021 ఏప్రిల్ మధ్యలో 1258 రోజుల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ బ్యాటుతో రాణించాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో బ్యాట్స్‌మాన్‌గా నిలిచాడు. మొత్తం 228 పరుగులు చేసిన బాబర్.. ఒక వన్డేలో సెంచరీ (103) కూడా నమోదు చేశాడు. దీంతో బాబర్‌కు భారీగా రేటింగ్ పాయింట్లు లభించాయి. ఇప్పుడు బాబర్‌కు కోహ్లీ కంటే 8 రేటింగ్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి.
పాకిస్తాన్ తరపున 2010, 2012 అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన బాబర్.. 2015లో పాక్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకున్న బాబర్.. సమకాలీన క్రికెట్లో విరాట్ కోహ్లీకి అసలైన పోటీ అని క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. పాక్ తరపున గతంలో జహీర్ అబ్బాస్, జావెద్ మియాందాద్, మహమ్మద్ యూసుఫ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో అగ్రస్థానినికి చేరుకున్నారు. వారి తర్వాత ఆ ఘనత సాధించిన పాక్ క్రికెటర్ బాబర్ అజమ్. టీ20 ర్యాంకింగ్‌లో గతంలో అగ్రస్థానంలో ఉన్న బాబర్.. ప్రస్తుతం 6వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించిన మరో పాక్ బ్యాట్స్మాన్ ఫకర్ జమాన్ కెరీర్ అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. అతడు ప్రస్తుతం 7వ ర్యాంకులో ఉన్నాడు.
A good update for 🇵🇰
Fakhar Zaman, following a brilliant series against South Africa, has surged five places to joint No.7 in the latest @MRFWorldwide ICC men’s ODI rankings for batsmen 👏 pic.twitter.com/WzSNehzdY3
1. షకీబుల్ హసన్ (408)
2. బెన్ స్టోక్స్ (295)
3. మహ్మద్ నబీ (294)
4. క్రిస్ వోక్స్ (273)
5. రషీద్ ఖాన్ (270)
6. మిచెల్ సాంట్నర్ (268)
7. ఇమాద్ వాసిమ్ (263)
8. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (257)
9. రవీంద్ర జడేజా (245)
10.షాన్ విలియమ్స్ (238)
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.