‘బాహుబలి 3’ సినిమాలో ఆసీస్ క్రికెటర్... సీక్వెల్‌ పోస్టర్ విడుదల చేసిన ‘బాహుబలి’ టీమ్...

బాహుబలి సీక్వెల్ సినిమాలో నటించాలని ఉందన చెప్పిన డేవిడ్ వార్నర్... వార్నర్ హెల్మెట్‌తో ‘బాహుబలి 3’ పోస్టర్ విడుదల చేసిన బాహుబలి టీమ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 5, 2019, 6:04 PM IST
‘బాహుబలి 3’ సినిమాలో ఆసీస్ క్రికెటర్... సీక్వెల్‌ పోస్టర్ విడుదల చేసిన ‘బాహుబలి’ టీమ్...
‘బాహుబలి’ సినిమాలో ఆ క్రికెటర్... సీక్వెల్‌లో నటించాలని ఉందన్న డేవిడ్ వార్నర్...
  • Share this:
‘బాహుబలి’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయంది ‘బాహుబలి’. ఈ సినిమా సాధించిన కలెక్షన్లు కొల్లగొట్టేందుకు ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వంటి భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమాలు, ‘రోబో 2.0’ వంటి గ్రాఫిక్ వండర్స్ ఎన్ని ప్రయత్నించినా సఫలం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.2500 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టాయి ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలు. ‘బాహుబలి’ సినిమా వచ్చి రెండేళ్లు కావస్తున్నా... ఈ సినిమా మానియా మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఐపీఎల్ సీజన్‌లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి ‘బాహుబలి’ సినిమాను గుర్తుచేసుకున్నాడు. ఆసీస్ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న డేవిడ్ వార్నర్... గత ఏడాది ‘బాల్ టాంపరింగ్’ వివాదం కారణంగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున బరిలో దిగిన వార్నర్... వస్తునే బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు సుమ కనకాలతో ఓ యాడ్‌లో పాల్గొన్న డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్... ఓ ప్రమోషన్ వీడియోలో కూడా పాల్గొన్నారు.

ఇందులో మీడియా అడిగిన ఓ సరదా ప్రశ్నకు ‘బాహుబలి సీక్వెల్ సినిమాలో నటించాలని ఉందని’ తన మనసులో కోరిక బయటపెట్టాడు డేవిడ్ వార్నర్. ‘యాక్టింగ్ కెరీర్‌లోకి వస్తే మీ గోల్ క్యారెక్టర్ ఏంటి?’ అనే ప్రశ్న ఎదురైంది కేన్ విలియంసన్, డేవిడ్ వార్నర్‌లకు. దీనికి కేన్ విలియంసన్ చాలా క్యాజువల్‌గా ‘నేను సినిమాల్లోకి రాను!’ అని తేల్చి పారేశాడు. డేవిడ్ వార్నర్ మాత్రం తనకు ‘బాహుబలి’ సినిమా సీక్వెల్‌లో నటించాలని ఉందని నవ్వేశాడు. సన్‌రైజర్స్ టీమ్‌లో అదరగొడుతున్న వార్నర్ కోరికను విన్న ‘బాహుబలి’ టీమ్ అతని కోసం ఓ స్పెషల్ పోస్టర్ రెఢీ చేసి విడుదల చేసింది. వార్నర్ మాట్లాడుతున్న వీడియోను ట్యాగ్ చేస్తూ... ‘హే డేవిడ్ వార్నర్... మీ కోరికను మేం విన్నాం. ‘బాహుబలి 3’ సీక్వెల్ రెఢీగా ఉంది. మీరు ఏ పాత్రలో నటించాలనుకుంటున్నారు? బాహుబలి పాత్రలోనా... భళ్లాలదేవుడిగానా?’ అంటూ పోస్టర్ డిజైన్ విడుదల చేసింది. ‘ఐపీఎల్ మిగిలిన మ్యాచుల్లోనూ బెస్ట్ హిట్టర్‌గా ఉండాలని కోరుకుంటున్నాం...’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ట్విట్టర్‌లో విడుదల చేసిన ‘బాహుబలి 3’ పోస్టర్...

Published by: Ramu Chinthakindhi
First published: April 4, 2019, 11:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading