ఫ్రస్ట్రేటెడ్ క్రికెటర్... అంబటి రాయుడికి అజారుద్దీన్ కౌంటర్

HCAలో అవినీతి పెరిగిపోయిందంటూ... అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై అజారుద్దీన్ తనదైన స్టైల్‌లో కౌంటర్ వేశారు. ఇటీవలే HCAకి అధ్యక్షుడైన అజారుద్దీన్ కౌంటర్‌కి అంబటి రాయుడు ఎలాంటి ఎటాక్ ఇస్తాడు?

news18-telugu
Updated: November 24, 2019, 10:37 AM IST
ఫ్రస్ట్రేటెడ్ క్రికెటర్... అంబటి రాయుడికి అజారుద్దీన్ కౌంటర్
అజారుద్దీన్, అంబటి రాయుడు
  • Share this:
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (HCA)లో అవినీతి పెరిగిపోయిందనీ, దీనిపై మంత్రి కేటీఆర్ దృష్టి పెట్టాలని క్రికెటర్ అంబటి రాయుడు కోరడం కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం స్పందించకపోయినా... HCA అధ్యక్షుడిగా ఈమధ్యే ఎన్నికైన మహ్మద్ అజారుద్దీన్ మాత్రం గట్టిగానే కౌంటరిచ్చారు. అంబటి ఫ్రస్ట్రేటెడ్ క్రికెటర్ అని విమర్శించారు. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసిన అంబటి రాయుడు... HCAలో అవినీతి బాగా ఉంటే, అందులో ఉన్న సభ్యులపై రకరకాల ఏసీబీ కేసులు ఉంటే... వాళ్లంతా HCA ముసుగు వేసుకొని పెద్దమనుషులుగా చెలామణీ అవుతుంటే... హైదరాబాద్ ఎలా గ్రేట్ అవుతుందని దాని క్రికెట్ టీమ్ ఎలా డెవలప్ అవుతుందని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. ఈ ఏడాది మొదట్లో ICC వరల్డ్ కప్‌కి ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడిని తీసుకోకపోవడంతో... అప్పట్లో ఇలాంటిదే ఓ త్రీడీ ట్వీట్ చేసిన రాయుడు... మళ్లీ ఇప్పుడు రెండోసారి విరుచుకుపడ్డాడు. అప్పట్లో చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్... విజయ్ శంకర్‌ను జట్టులోకి ఎందుకు తీసుకున్నదీ చెబుతూ... అతనికి త్రీడైమెన్షనల్ స్కిల్స్ ఉన్నాయని (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అన్నాడు. దానిపై సెటైర్ వేస్తూ రాయుడు... తాను త్రీడీ గ్లాసెస్ కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపాడు.


వరల్డ్ కప్ తర్వాత అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకున్నారు. కానీ అంబటి ఆగస్టులో తిరిగి జట్టులోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోపీ, సయ్యద్ ముష్తక్ అలీ ట్రోపీలో హైదరాబాద్‌‌ను ముందుకు నడిపించాడు. ఈ స్టైలిష్ హైదరాబాదీ బ్యాట్స్‌మన్ 55 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడి... 1,694 రన్స్ చేశాడు. అలాగే ఇండియా తరపున 6 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 

Pics : హాట్ అందాల రచ్చ చేస్తున్న ప్రియాంక జవాల్కర్ఇవి కూడా చదవండి :

ఆ గుడ్లు తింటే... అంతే సంగతులు... బీఅలర్ట్

పాపం నాలుగేళ్ల చిన్నారి... వేడి నీళ్లు పడి మృతి

ఇన్సులిన్‌ను పెంచుతున్న కొత్త ప్రోటీన్... కనుక్కున్న పరిశోధకులు

అప్పుడు ఫిజిక్స్‌లో జీరో... ఇప్పుడు ఆస్ట్రోఫిజిసిస్ట్... ఇన్స్‌పిరేషనల్ స్టోరీ

యూనివర్శిటీ ఫీజు కోసం బట్టలిప్పి... రూ.2.30 లక్షలు సంపాదించిన యువతి

First published: November 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>