Australia: అద్భుతం.. మహా అద్భుతం .. వన్డే క్రికెట్‌లో సంచలన వరల్డ్‌ రికార్డు!

Australia's women team

వన్డే క్రికెట్‌ చరిత్రలో ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త రికార్డు సృష్టించింది. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది.

  • Share this:


    వన్డే క్రికెట్‌ చరిత్రలో ఆస్ట్రేలియా మహిళల జట్టు(Australia's women team) కొత్త రికార్డు సృష్టించింది. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. తాజాగా న్యూజిలాండ్‌ మహిళలతో జరిగిన వన్డేలో ఆసీస్‌ మహిళలు జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపోందారు. దీంతో అత్యధికంగా 22 వరుస విజయాలు సాధించిన జట్టుగా అద్భుత చరిత్రను లిఖించింది. మరో విశేషమేమిటంటే అంతకు రికీ పాంటింగ్‌ సారథ్యంలోని ఆసీస్ పురుషల జట్టు 2003 సీజన్‌లో ఇలానే వరుసగా 21 వన్డే విజయాలు సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును మహిళల జట్టు బ్రేక్‌ చేసింది. వరుసగా 22 విజయాలు సాధించి టాప్‌లో నిలిచింది.

    ఆసీస్‌ మహిళల జట్టు 2017 చివరిసారి వన్డే ఓటమిని ఎదురుకుంది. ఇక అప్పటినుంచి వరుస విజయాలతో దూసుకుతొంది. 2018 మార్చి నుంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. ఆ ఏడాది భారత్‌ జరిగిన సీరిస్‌లో ఆసీస్‌ మహిళలు జట్టు 3-0తో సీరిస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌ ఆడిన మరో వన్డే సీరిస్‌ను కూడా 3-0తో క్లిన్ స్విప్ చేశారు. దీంతో వారికి తిరిగి లేకుండా పోయింది.
    న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక సీరిస్‌ల్లో సైతం ఆసీస్‌ మహిళల జట్టే గెలుపోందింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడుతుంది. ఈ సీరిస్‌లో తొలి మ్యాచ్‌ని 1-0 ఆధిక్యంతో గెలిపోదింది ఆసీస్. దీంతో అద్భుతమైన రికార్డు కల సహాకారమైంది.
    Published by:Rekulapally Saichand
    First published: