ఇది చూశారా.. కూల్‌డ్రింక్ బాయ్‌గా ప్రధాని.. గ్రౌండ్‌లో క్రికెటర్లలో జోష్

ఓ ప్రధానమంత్రి కూల్‌డ్రింక్ బాయ్‌లాగా మారి.. ఇలా చేయడం క్రికెట్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది.

news18-telugu
Updated: October 25, 2019, 3:10 PM IST
ఇది చూశారా.. కూల్‌డ్రింక్ బాయ్‌గా ప్రధాని.. గ్రౌండ్‌లో క్రికెటర్లలో జోష్
గ్రౌండ్‌లో ఆటగాళ్లకు వాటర్ అందిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్
  • Share this:
ఓ దేశ ప్రధానమంత్రి క్రికెట్ గ్రౌండ్‌లో పరిగెడుతూ.. క్రికెటర్లకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం చూశారా? ఇప్పుడు చూడొచ్చు. ఆ ప్రధానమంత్రి ఎవరోకాదు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. ఆస్ట్రేలియా పీఎం 11 వర్సెస్ శ్రీలంక మధ్య సన్నాహక మ్యాచ్ ఆస్ట్రేలియాలోని ఓవల్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా అధ్యక్షుడు హాజరయ్యారు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. ఆ సమయంలో స్వయంగా స్కాట్ మారిసన్ కూల్ డ్రింక్స్ పట్టుకుని క్రికెటర్ల వద్దకు వెళ్లి ఇచ్చివచ్చారు.

తల మీద ఆస్ట్రేలియా క్రికెట్ క్యాప్, చేతిలో డ్రింక్స్ స్టాండ్ పట్టుకుని అందరివద్దకు వెళ్లి డ్రింక్స్ ఇస్తున్న ఆయన్ను చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు.. గ్రౌండ్‌లో క్రికెటర్లు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ప్రధానమంత్రి కొందరు క్రికెటర్లకు హైఫై కూడా ఇవ్వడం కొసమెరుపు.ఓ ప్రధానమంత్రి కూల్‌డ్రింక్ బాయ్‌లాగా మారి.. ఇలా చేయడం క్రికెట్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది.

ధన్‌తేరస్ ఎందుకొచ్చింది... బొమ్మల కథ

First published: October 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>