Home /News /sports /

AUSTRALIAN OPEN 2022 AUSTRALIA CANCELS NOVAK DJOKOVICS VISA DENIES ENTRY HE APPEALS IN COURT SK

Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం జోకోవిచ్‌కు ఊహించని షాక్.. వీసా రద్దు చేసిన ఆస్ట్రేలియా.. 8 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే

జోకోవిచ్

జోకోవిచ్

Novak Djokovic: నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడిని ఇలా ఎయిర్‌పోర్టులోనే అడ్డుకోవడంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతోంది. టెన్నిస్ దిగ్గజాన్ని ఘోరంగా అవమానపరిచారని ఆయన అభిమానులు ఆస్ట్రేలియా ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

    టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నెంబర్ 1 నోవాక్ జోకోవిచ్‌ (Novak Djokovic)కు చేదు అనుభవం ఎదురయింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ (Australia Open)లో పాల్గొనేందుకు వెళ్లిన జోకోవిచ్‌కు ఆ దేశం ఊహించని షాక్ ఇచ్చింది. ఎయిర్‌పోర్టులోనే ఆయన్ను నిలిపివేసి వీసాను రద్దు చేసింది. సెర్బియాకు చెందిన జోకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనాల్సి ఉంది. అందుకోసం ఆస్ట్రేలియాకు పయనమైన ఆయన.. బుదవారం మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టు (Melbourne Airport)లో ల్యాండ్ అయ్యారు. ఐతే ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించి తగిన ఆధారాలను చూపించని కారణంగా జోకోవిచ్‌ను ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు వీసాను కూడా రద్దు చేశారు. దాంతో చేసేదేం లేక.. 8 గంటల పాటు మెల్ బోర్న్ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు జోకోవిచ్.

    Adult Stars : పాపం.. తప్పని పరిస్థితుల్లో ఈ స్పోర్ట్స్ వుమెన్ శృంగార తారలుగా మారారు

    వాస్తవానికి ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు జోకోవిచ్‌కు వైద్యపరమైన మినహాయింపులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన వ్యాక్సిన్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టారు. కానీ దానికి ప్రత్యేకమైన వీసా ఉంటుంది. ఆ వీసాకు దరఖాస్తు చేయకుండా, వేరే క్యాటగిరీకి చెందిన వీసాతో జోకోవిచ్ ఆస్ట్రేలియా వచ్చారు. అందువల్లే ఆయన్ను అడ్డుకున్నామని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. కోవిడ్ టీకా మినహాయింపునకు సంబంధించిన ఆధారాలను సమర్పించకపోతే.. ఆయన్ను దేశం నుంచి వెనక్కి పంపిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డిపోర్టేషన్‌ను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు జోకోవిచ్.

    Virat Kohli: అయ్యో.. కోహ్లీకి ఈ ఏడాది కలిసొచ్చినట్టు లేదు.. మొన్న గాయం.. ఇప్పుడు ఇలా ..

    తాజాగా ఈ వ్యవహారంపై సెర్బియా ప్రభుత్వం స్పందించింది. ఆస్ట్రేలియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడితో ఇలాగేనా వ్యవహరించేదని ఆ దేశ ప్రెసిడెంట్‌ అలెక్సాండర్‌ వ్యూకిక్‌ (Serbia President Aleksandar Vucic) మండిపడ్డారు. తాను జోకోవిచ్‌తో మాట్లాడానని.. ఆయనకు దేశం మొత్తం అండగా ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. అటు ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ (Scott Morrison) సైతం స్పందించారు. తమ దేశ సరిహద్దుల్లోకి ఎవరు వచ్చినా కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. ఏ వ్యక్తికికైనా ఒకే విధమైన నిబంధనలు ఉంటాయని తేల్చి చెప్పారు.

    పాపిష్టి కరోనా.. గంగూలీ కుటుంబాన్ని వదలడం లేదు.. మొన్న దాదా.. ఇప్పుడు..

    కాగా, జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌(Australian Open)‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా జకోవిచ్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడిని ఇలా ఎయిర్‌పోర్టులోనే అడ్డుకోవడంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతోంది. టెన్నిస్ దిగ్గజాన్ని ఘోరంగా అవమానపరిచారని ఆయన అభిమానులు ఆస్ట్రేలియా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఐతే ఎంత గొప్ప స్టార్ అయినా.. రూల్స్‌ని పాటించాలని కదా.? అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలే ఒమిక్రాన్ విజృంభిస్తోందని.. ఇలాంటి సమయంలో నిబంధనలను పాటించుకపోతే ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Australia, Novak Djokovic, Tennis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు