Australian Open 2020: అమెరికా టెన్నీస్ తార సోఫియానే ఛాంపియన్

Australian Open 2020: ఆస్ట్రేలియా ఓపన్ సింగిల్స్ టైటిల్‌ను అమెరికా టెన్నీస్ తార సోఫియా కైవసం చేసుకుంది. మాజీ నెం.మురుగుజను 14వ సీడ్ సోఫియా ఫైనల్లో మట్టికరిపించింది.


Updated: February 1, 2020, 5:42 PM IST
Australian Open 2020: అమెరికా టెన్నీస్ తార సోఫియానే ఛాంపియన్
ఆస్ట్రేలియా ఓపెన్ 2020 మహిళల సింగిల్స్ ఛాంపియన్ సోఫియా కెనిన్
  • Share this:
ఆస్ట్రేలియా ఓపన్‌లో అమెరికా తార సోఫియా కెనిన్ సంచలనం సృష్టించింది.  మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 21 ఏళ్ల సోఫియా కెనిన్‌కు ఇదే తొలి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. 2008 తర్వాత ఆస్ట్రేలియా ఓపన్ గెలిచిన అతిపిన్న వయస్కురాలిగా సోఫియా రికార్డు సృష్టించింది. శనివారం మెల్‌బోర్న్ పార్క్‌లో జరిగిన ఫైనల్లో 14వ సీడ్ సోఫియా 4-6, 6-2, 6-2 సెట్స్‌లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత ముగురుజ(స్పెయిన్)ను మట్టికరిపించింది. తొలి సెట్‌ను కోల్పోయిన సోఫియా...ఆ తర్వాత గట్టి పోటీ ఇచ్చింది. వరుసగా రెండు సెట్లను గెలుచుకుని టైటిల్ కైవసం చేసుకుంది.

సెమీస్‌లో ఆస్ట్రేలియాకు చెందిన టాప్ సీడ్ ఆష్టే బార్టీని మట్టికరిపించి సోఫియా ఫైనల్లో అడుగుపెట్టడం తెలిసిందే. గతంలో ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ సోఫియా క్వార్టర్స్ ఫైనల్‌ను అధిగమించలేదు. మాజీ నెం.1 మురుగుజ 2016లో ఫ్రెంచ్ ఓపన్ టైటిల్, 2017లో వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది.




First published: February 1, 2020, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading