హోమ్ /వార్తలు /క్రీడలు /

video: ఉప్పొంగిన బ్రిస్బేన్‌.. ఆసీస్‌ అభిమాని నోట భారత్‌ మాతాకీ జై నినాదాలు

video: ఉప్పొంగిన బ్రిస్బేన్‌.. ఆసీస్‌ అభిమాని నోట భారత్‌ మాతాకీ జై నినాదాలు

fan-chants-bharat-mata-ki-jai-in-brisban

fan-chants-bharat-mata-ki-jai-in-brisban

60 ఏళ్ళ టీమిండియా క్రికెట్ ప్రస్థానంలో ఈ గెలుపు ఓ అద్భుతం. వెనక్కి వెళ్లి చరిత్ర పుటలను తిరిగేసినప్పుడు ఈ విజయాన్ని భారత్ సగౌరవంగా చెప్పకొవచ్చు. 32 ఏళ్లుగా గబ్బా స్టేడియంలో ఓటమే ఎరుగని ఆస్ట్రేలియా జట్టును టీమిండియా ఓడిచింది.

  60 ఏళ్ళ టీమిండియా క్రికెట్ ప్రస్థానంలో ఈ గెలుపు ఓ అద్భుతం. వెనక్కి వెళ్లి చరిత్ర పుటలను తిరిగేసినప్పుడు ఈ విజయాన్ని భారత్ సగౌరవంగా చెప్పకొవచ్చు. 32 ఏళ్లుగా గబ్బా స్టేడియంలో ఓటమే ఎరుగని ఆస్ట్రేలియా జట్టును టీమిండియా ఓడిచింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. పర్యటన మెుదలైనప్పటి నుంచి జట్టుకు అన్ని అటంకాలే.. కరోనా ప్రోటోకాల్,కీలక ఆటగాళ్లు గాయాలు ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని భారత్ బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ముద్దాడింది.ఈ విజయంతో భారత్ క్రీడా అభిమానుల గుండె ఉప్పొంగింది. టీమిండియా సిరీస్ ఈ నెల పులకరించింది. క్రీడా దిగ్గజాలు భారత్ అసమాన పోరాటాన్ని కొనియాడారు. వీరు..వారు అనే కాదు ఆసీస్‌ ఆటగాళ్లు, కోచ్‌,ఆ దేశ అభిమానులు కూడా భారత్ విజయాన్ని అద్భుతమంటూ కీర్తించారు.


  మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని టీమిండియాకు విజయాన్ని అస్వాదిస్తూ చేసిన నినాదాలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. గ్యాలరీలో నిలుచుని ‘భారత్‌ మాతాకి జై’, ‘వందే మాతరం’ అంటూ నినాదించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ అభిమాని టీమిండియాను కీర్తించిన తీరును వాట్సప్ స్టేటస్‌లుగా పెట్టుకుంటున్నారు. కాగా

  గబ్బా స్టేడియంలో యంగ్ ఇండియా దుమ్మురేపింది. 31 ఏళ్ల పాటు ఓటమి ఎరుగని ఆసీస్ జట్టును అదే స్టేడియంలో ఓడించి... చరిత్ర తిరగారాసింది. అయితే, ఈ టెస్ట్ లో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మోత మోగించారు. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. యంగ్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అదిరిపోయే బ్యాటింగ్ తో టీమిండియా అద్భుత విజయాన్ని అందించాడు. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచి సవాల్‌ విసిరిన ఆసీస్‌కు అదే రీతిలో భారత బ్యాట్స్‌మెన్స్‌ సమాధానం చెప్పారు. నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: England vs Australia

  ఉత్తమ కథలు