ఆల్ టైమ్ ఇండియన్ బెస్ట్ క్రికెట్ టీమ్.. జట్టులో వరెవరూ ఉన్నారో తెలుసా..

ఆస్ట్రేలియ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ భారత అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటించారు.

news18-telugu
Updated: April 1, 2020, 8:27 PM IST
ఆల్ టైమ్ ఇండియన్ బెస్ట్ క్రికెట్ టీమ్.. జట్టులో వరెవరూ ఉన్నారో తెలుసా..
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్ (Image: ICC)
  • Share this:
ఆల్ టైమ్ ఇండియన్ బెస్ట్ క్రికెట్ టీమ్.. అదేంటి అనుకుంటున్నారా.. అవును ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆ జట్టును ప్రకటించారు. ఇందులో విరాట్ క్లోహీ, ఎంఎస్ ధోనీ లేకపోవడం గమనార్హం. అయితే మరి జట్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే. షేన్ వార్న్ ప్రకటించిన అత్యుత్తమ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, నవజోత్ సింగ్ సిద్ధును ఓపెనర్లుగా ఎంపిక చేయగా, కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీని ఎంపిక చేశాడు. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. ఆస్ట్రేలియా ఎన్నో రికార్డులు సాధించిన వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేయలేదు.

ఈ సందర్భంగా షేన్ వార్న్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో తన మనోగతాన్ని పంచుకుంటూ ఆల్‌టైమ్ బెస్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్‌ను ప్రకటించేశాడు. ఇందులో ఓపెనర్‌గా నవజోత్ సింగ్ సిద్ధూను ఎంపిక చేయడంపై బదులిస్తూ.. నవజోత్ సింగ్ సిద్ధూ స్పిన్ అద్భుతంగా ఆడతాడు. చాలామంది గొప్ప స్పిన్నర్లు ఇదే విషయాన్ని నాతో పంచుకున్నారు. అందుకే అతడిని ఓపెనర్‌గా ఎంపిక చేసినట్టు చెప్పుకొచ్చారు.

మూడో స్థానంలో రాహుల్ ద్రావిడ్, నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్, ఐదో స్థానంలో అజారుద్దీన్, ఆరోస్థానంలో గంగూలీలకు చోటు కల్పించాడు. ద్రావిడ్ నాకు మంచి స్నేహితుడని, అతడు ఆసీస్‌పై ఎన్నో సెంచరీలు చేశాడని చెప్పాడు. లక్ష్మణ్‌ను ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ.. దాదా సారథిగా ఉండాలని భావించడం వల్ల లక్ష్మణ్‌కు చోటు కల్పించలేదని వార్న్ చెప్పుకొచ్చాడు.

షేన్ వార్న్ ప్రకటించిన ఆల్‌టైమ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఇదే..
వీరేంద్ర సెహ్వాగ్, నవజోత్ సింగ్ సిద్దూ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ(కెప్టెన్), కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, నయన్ మోంగియా, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్
First published: April 1, 2020, 8:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading