భారత సంతతి యువతితో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్...

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన భారత సంతతి యువతి వినీ రామన్‌ ను పెళ్లి చేసుకోబోతున్నాడు.

news18-telugu
Updated: February 26, 2020, 9:37 PM IST
భారత సంతతి యువతితో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్...
మ్యాక్స్‌వెల్, వినీ రామన్ ఎంగేజ్ మెంట్
  • Share this:
ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన భారత సంతతి యువతి వినీ రామన్‌ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని మాక్స్‌వెల్‌ సోషల్‌ మీడియాలో తెలిపాడు. ఈ సందర్భంగా కాబోయే భార్యతో ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ వినీ రామన్ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపిస్తూ ఫొటోకు పోజునివ్వడం విశేషం. వీరిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే ఆసీస్‌ క్రికెటర్లు చెబుతున్నారు. విదేశీ పర్యటనలు, డిన్నర్‌లకు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ జంట ఇప్పుడు ఒకటి కావాలని నిర్ణయించుకుంది. రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో కూడా ఉన్నారు. ఈ జోడీ ఫొటో తొలిసారి 2017లో మీడియా దృష్టిలో పడింది. 2019 ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో తన కాబోయే భాగస్వామి రామన్‌తో కలిసి మాక్స్‌వెల్‌ రావడంతో పెళ్లి గురించి చర్చ మొదలైంది. తాజాగా మాక్సీ-వినీ ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో ఆసీస్‌ క్రికెటర్లు కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నారు.

మెల్‌బోర్న్‌లో స్థిర పడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి విని రామన్. ఆమె ఓ ఫార్మాసిస్ట్. తమిళనాడుకు చెందిన ఆమె పూర్వీకులు ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి డేట్ ఎప్పుడు అనేది ఇంకా  ప్రకటించలేదు. ఈ జోడీ ఒక్కటైతే భారత సంతతి అమ్మాయిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్​గా మ్యాక్సీ నిలవనున్నాడు. ఇంతకు ముందు షాన్​ టైట్ భారత యువతినే పెళ్లాడాడు. 2014 ఐపీఎల్ సమయంలో మాషుమ్ సింఘాను కలిసిన టైట్ అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం గాయంతో విశ్రాంతిలో ఉన్న మ్యాక్స్‌వెల్‌ ఐ పీఎల్తో  రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading