• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • AUSTRALIAN CRICKETER DAVID WARNER SHARES MORPHED VIDEO AS SUPER STAR RAJINIKANTH SRD

David Warner : వార్నీ..వార్నరూ..నీ వాడకం తర్వాతే ఎవరైనా..సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వదల్లేదుగా..

David Warner : వార్నీ..వార్నరూ..నీ వాడకం తర్వాతే ఎవరైనా..సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వదల్లేదుగా..

Photo Credit : Instagram

David warner : సోషల్ మీడియాలో ఈ క్రికెట‌ర్ ఉన్నంత బిజీగా మ‌రెవ‌రూ ఉండ‌రంటే..నిజ‌మ‌ని ఒప్పుకోక త‌ప్పుదు. ఆ క్రికెట‌ర్ ఎవ‌రనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ టీమ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌. ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్ ఐపీఎల్ ఆడుతున్న‌ప్ప‌టి నుంచి మ‌న ఇండియ‌న్ సినిమాల‌పై మ‌క్కువ పెంచుకున్నాడు.

  • Share this:
    సోషల్ మీడియాలో ఈ క్రికెట‌ర్ ఉన్నంత బిజీగా మ‌రెవ‌రూ ఉండ‌రంటే..నిజ‌మ‌ని ఒప్పుకోక త‌ప్పుదు. ఆ క్రికెట‌ర్ ఎవ‌రనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ టీమ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌. ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్ ఐపీఎల్ ఆడుతున్న‌ప్ప‌టి నుంచి మ‌న ఇండియ‌న్ సినిమాల‌పై మ‌క్కువ పెంచుకున్నాడు. ముఖ్యంగా, మ‌న ద‌క్షిణాది సినిమాలన్నా, హీరోల‌న్నా వార్న‌ర్ ఎక్కువ ఇష్ట‌ప‌డుతుంటాడు. ఇష్ట‌ప‌డ‌ట‌మే కాదండోయ్‌..వారు న‌టించిన సినిమాల్లోని పాట‌ల‌కు డాన్సులు వేయ‌డం, డైలాగ్స్‌ను చెప్ప‌డం వంటి ప‌నులు చేసి ఆ వీడియోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి స‌ద‌రు హీరోల అభిమానుల‌ను అల‌రిస్తుంటాడు వార్న‌ర్‌. ఇందుకు చాలా ఉదాహ‌ర‌ణ‌లే ఉన్నాయి. బుట్ట‌బొమ్మ సాంగ్‌లో భార్య‌తో వార్న‌ర్ వేసిన స్టెప్పులేయ‌డం, బాహుబ‌లిలో ప్ర‌భాస్ డైలాగ్‌ను చెబుతూ వీడియోలు చేయ‌డం, అలాగే పేస్ ఆఫ్ యాప్‌ను ఉప‌యోగించి సౌత్‌స్టార్స్ సినిమాల్లో కొన్ని స‌న్నివేశాల్లో స‌ద‌రు హీరోల స్థానంలో రీ ఫేస్‌ యాప్‌ ద్వారా త‌న ఫేస్‌ను అతికించి అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు.తెలుగు, తమిళ్‌, హింది అన్న తేడా లేకుండా.. వీడియోలతో ఎప్పుడూ ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు వార్నర్‌. ఇప్పుడు తాజాగా.. రజనీకాంత్‌ స్టైల్‌.. ఇరగదీశాడు. అంతేకాదు.. తలైవాకు సంబంధించిన పలు సినిమాలోని డైలాగ్‌లను.. కూడా వార్నర్‌ పలికించాడు.

    ఇక బాలీవుడ్‌ బడా హీరోల నుంచి మొదలు పెడితే.. టాలీవుడ్‌ వరకు హీరోల మొహాల స్థానంలో తన ఫేస్‌ను సెట్‌ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తున్నాడు. రీఫేస్‌ యాప్‌ సహాయంతో అమితాబ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, రజనీకాంత్‌ వంటి హీరోల సన్నివేశాలకు తన మొహాన్ని యాడ్ చేసి పోస్ట్‌ చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ క్రికెటర్ దళపతి ఫ్యాన్స్‏ను అలరిస్తున్నాడు. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ‘మాస్టర్’ బాక్సాఫీసు దగ్గర సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.



    ఇటీవల వరుసగా తెలుగు హీరోల సినిమాలను రీఫేస్ చేస్తూ వస్తున్న వార్నర్ తాజాగా విజయ్ నటించిన మాస్టర్ సినిమాను రీఫేస్ చేసి.. తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. దీంతో వార్నర్‌కు క్రికెట్ ఏమో తెలియదు కానీ ఈ వీడియోల ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ వస్తోంది. అంతేకాకుండా ఎంతోమంది తన అభిమానులుగా మారిపోతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు