• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • AUSTRALIAN CRICKETER DAVID WARNER BIRTHDAY WISHES TO TOLLYWOOD HERO JR NTR BS

జూనియర్ ఎన్టీఆర్‌ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ ..

జూనియర్ ఎన్టీఆర్‌ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ ..

జూనియర్ ఎన్టీఆర్, డేవిడ్ వార్నర్ దంపతులు

జూనియర్ ఎన్టీఆర్‌కు అందరికంటే భిన్నంగా బర్త్ డే విషెస్ చెప్పాడు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.

  • Share this:
    యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖుల నుంచి విషెస్ అందుతున్నాయి. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు.. ఇలా తమదైన శైలిలో ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, అందరికంటే భిన్నంగా విషెస్ చెప్పాడు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఈ మధ్య టిక్‌టాక్‌లో తెలుగు పాటలకు స్ఫూఫ్ చేస్తూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్న వార్నర్.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్‌తో కలిసి చేసిన ‘నేను పక్కా లోకల్’ సాంగ్‌కు టిక్‌టాక్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. భార్య క్యాండీ వార్నర్‌తో కలిసి అద్భుతంగా స్టెప్పులేశాడు. ‘తారక్ నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు నీకు గొప్ప రోజు కావాలి. మేము డ్యాన్స్ బాగానే చేశాం. కానీ.. నువ్వు చాలా వేగంగా చేశావ్’ అని కామెంట్ చేశాడు.

    ఈ వీడియో చూసిన తారక్ ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఒక అంతర్జాతీయ క్రికెటర్, అది కూడా విదేశీయుడు.. తారక్‌కు శుభాకాంక్షలు చెప్పడం ఆనందాన్ని ఇస్తోందని అంటున్నారు. కామెంట్లు, లైకులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    అగ్ర కథనాలు