Home /News /sports /

AUSTRALIAN CANOEIST USED CONDOM TO REPAIR HER KAYAK AND WON GOLD MEDAL IN TOKYO OLYMPICS JNK

Tokyo Olympics: సరియైన టైంలో కండోమ్ వాడింది.. గోల్డ్ మెడల్ కొల్లగొట్టింది..

ఒలింపిక్స్‌లో కండోమ్‌ను ఇలా కూడా వాడొచ్చా? (Olympics)

ఒలింపిక్స్‌లో కండోమ్‌ను ఇలా కూడా వాడొచ్చా? (Olympics)

ఒలింపిక్స్‌లో కండోమ్స్ ఇవ్వడం ఆనవాయితీ. ఈ సారి టోక్యో వచ్చిన అథ్లెట్లకు కూడా కండోమ్స్ ఉచితంగా ఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారం జరపవద్దని నిర్వాహకులు నిబంధనలు విధించారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన అథ్లెట్ మాత్రం కండోమ్ ఉపయోగించి ఏకంగా బంగారు పతకమే కొట్టేసింది.

ఇంకా చదవండి ...
    టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) పాల్గొంటున్న అథ్లెట్ల విషయంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. తమ క్రీడా సామాగ్రి (Sports Gear) పాడై పోవడం వల్ల అర్హత కోల్పోయిన వారిని చూశాము. వాటిని రిపేర్ (Repair) చేసుకొని బరిలోకి దిగే సరికి సమయం మించి పోయిన వారిని కూడా మన చూశాం. భారత షూటర్ మను భాకర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో పని చేయకుండా పోయింది. ఆ సమయంలో ఆమె షూటింగ్ రేంజ్‌ను వదిలి బయటకు వెళ్లి దాన్ని సరి చేసుకొని వచ్చే సరికి సమయం వృధా అయ్యింది. దీంతో నిర్ణీత సమయంలో ఆమె షాట్స్ కొట్టలేక తుది రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడం చూశాము. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన అథ్లెట్ జెస్సికా ఫాక్స్ (Jessica Fox) కూడా తన అనుభవాన్ని వివరించింది. కయాక్  (Kayak) పోటీలో ఆమె బంగారు పతకం కొల్లగొట్టింది. అయితే పోటీల సమయంలో ఆమె కయాక్ (బోట్) ముందు భాగం పాడైన విషయాన్ని గమనించింది. దీంతో ఏం చేయాలో పాలు పోలేదు. వెంటనే ఒక కార్బన్‌ను రకమైన పిండి పదార్థంతో కలిపి కయాక్ ముందు భాగానికి అతికించింది. నీటిలో అది కరిగిపోకుండా దానికి కండోమ్ తొడిగి రిపేర్ పూర్తి చేసింది.

    జెస్సికా ఫాక్స్ తాను బోటును ఎలా రిపేర్ చేసుకుందో చూపిస్తూ ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ వీడియోను చూసిన క్రీడాభిమానులు అవాక్కవుతున్నారు. తన చాకచక్యానికి మెచ్చుకుంటున్నారు. బోటు పాడైందని బాధపడకుండా అందుబాటులో ఉన్న వస్తువులతో రిపేర్ చేసుకోవడాన్ని అభినందిస్తున్నారు. ఈ వీడియోతో పాటు ఆమె గోల్డ్ గెలవడంతో ఆస్ట్రేలియాలో ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారిపోయింది. తను గోల్డ్ గెలవడం కంటే ఆమె చాకచక్యంగా వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో అభినందనల వెల్లువలు వస్తున్నాయి.



    కండోమ్‌లను ఇలా కూడా ఉపయోగించవచ్చా అని నెటిజన్లు సరదాగా కామెంట్లు కూడా పెడుతున్నారు. కాగా, ఇది ఒలింపిక్స్ నిర్వాహకులు అథ్లెట్లకు ఇచ్చిన ఫ్రీ కండోమ్స్ కావడం గమనార్హం. అథ్లెట్లకు కండోమ్స్ ఇచ్చినా కరోనా నిబందనల కారణంగా శృంగారం జరపవద్దనే కఠిన నిబందనలు అమలు చేస్తున్నది. దీంతో అథ్లెట్లు తమతో పాటే అవి ఉంచుకుంటున్నా.. ఉపయోగించే అవకాశం మాత్రం లేకుండా పోయింది. ఇప్పుడు జెస్సికా ఫాక్స్ ఆ కండోమ్‌ను ఉపయోగించిన తీరు చూసి అందరూ అవాక్కవుతున్నారు. కరోనా నిబంధనలు ఉన్నా.. కండోమ్‌ను ఇలా ఉపయోగించవచ్చన్న మాట అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. పైన షేర్ చేసిన వీడియోను మీరు కూడా చూసేయండి.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Olympics, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు