AUSTRALIAN BATSMAN CHRIS THEWLIS SMASHES 237 OFF JUST 72 BALLS FIREWORKS BATTING GOES VIRAL IN SOCIAL MEDIA SRD
Viral Video : ఇదేం బాదుడు సామీ... 72 బంతుల్లో పరుగుల సునామీ సృష్టించావుగా..!
Chris Thewlis (PC : Twitter)
Viral Video : మొదటి బంతి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లు ఎవరైనా సరే.. బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్, పొలార్డ్ ను మించి పెను విధ్వసం సృష్టించాడు.
క్రికెట్ (Cricket Latest Telugu News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. పొట్టి క్రికెట్ వచ్చాక.. క్రికెటర్లు అవలీలగా బంతిని బౌండరీ దాటిస్తున్నారు. ఇక, సింగిల్స్ కొట్టినంత ఈజీగా సిక్సర్లు కొట్టేస్తున్నారు. ఒక బ్యాటర్ ఎన్ని సింగిల్స్, డబుల్స్, ఫోర్లు కొట్టినా సిక్స్ కొడితే వచ్చే కిక్కే వేరు. క్రికెట్ లో టీ20ల హవా మొదలయ్యాక సిక్స్ ల వర్షం కురుస్తోంది. ప్రపంచ విధ్వంసకర బ్యాటర్లు అందరు తమ బలాన్నంతా కూడదీసుకుని సిక్స్ లు కొడుతున్నారు. పొలార్డ్(Pollard), ధోని (Ms Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma), క్రిస్ గేల్ (Chris Gayle), బట్లర్ వంటి హిట్టర్లెందరో భారీ సిక్సర్లతో అభిమానులకు కావాల్సిన మజా అందిస్తున్నారు. అయితే టీ 20, వన్డే ల్లో కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా మేం ఏం తక్కువ కాదని కొందరు నిరూపిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా వేదికగా విక్టోరీయా ప్రీమియర్ క్రికెట్ లో క్యాంబర్ వెల్ మాగ్పీస్ ఓపెనర్ క్రిస్ థెవ్లిస్ పెను విధ్వంసమే సృష్టించాడు.
మొదటి బంతి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లు ఎవరైనా సరే.. బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్, పొలార్డ్ ను మించి పెను విధ్వసం సృష్టించాడు. ఈ క్రమంలో 72 బంతుల్లో 237 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 20 ఫోర్లు, 24 సిక్సర్లు ఉండటం విశేషం.
కింగ్ స్టన్ హత్రోన్ తో జరిగిన మ్యాచులో ఈ పరుగుల సునామీని సృష్టించాడు థెవ్లిస్. ఇక, ఈ మ్యాచులో క్యాంబర్ వెల్ మాగ్పీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. థెవ్లిస్ విధ్వంసంతో ఆ జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 441 పరుగులు చేసింది. అయితే, భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కింగ్ స్టన్ హత్రోన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు మాత్రమే చేసింది. దీంతో, 238 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.
Chris Thewlis nailed 2️⃣0️⃣ fours and 2️⃣4️⃣ sixes in his innings of 237 (72) in @vicpremcricket twos yesterday!
Here's the man who has @vicpremcricket talking today, Camberwell Magpie Chris Thewlis, who cracked 237 off 72 balls against Kingston Hawthorn in the Second XI. Spectators here at Watson Park in Ashburton say it was the cleanest hitting they've seen. pic.twitter.com/COMbCGsSip
ఇక, ఈ మ్యాచ్ లో థెవ్లిస్ వన్ మ్యాన్ షో ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం అతని ఇన్నింగ్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కింగ్ స్టన్ వేసిన స్లో బాల్ కి థెవ్లిస్ ఔటయ్యాడు. ఇక, థెవ్లిస్ సూపర్ ఇన్నింగ్స్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదేం బాదుడు సామీ.. సెహ్వాగ్, డివిలియర్స్ ని మించిపోయావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, థెవ్లిస్ చేసిన పరుగులు కూడా ప్రత్యర్థి జట్టు చేయకపోవడం విశేషం.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.