ఆస్ట్రేలియా క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు... రేప్ కేసులో దోషిగా తేలిన అలెక్స్ హెప్‌బర్న్

Alex Hepburn : నిద్రపోతున్న అమ్మాయిపై ఆస్ట్రేలియన్ క్రికెటర్ అలెక్స్ హెబ్ బర్న్ అత్యాచారానికి పాల్పడటం దారుణమే.

Krishna Kumar N | news18-telugu
Updated: May 1, 2019, 9:17 AM IST
ఆస్ట్రేలియా క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు... రేప్ కేసులో దోషిగా తేలిన అలెక్స్ హెప్‌బర్న్
అలెక్స్ హెప్ బర్న్
  • Share this:
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ అలెక్స్ హెప్‌బర్న్‌ రేప్ కేసులో దోషిగా తేలాడు. అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 2017లో ఈ ఘటన జరిగితే... తనపై వచ్చిన ఆరోపణల్ని అలెక్స్ ఖండిస్తూ వచ్చాడు. ఆమె తనతో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొంది అని చెప్పుకొచ్చాడు. కోర్టు బాధితురాలి వాదనని కూడా పరిశీలించింది. ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వివరించే సందర్భంలో ఆమె ఎలాంటి అసత్యాలూ పలకలేదని కోర్టు గుర్తించింది. ఆ క్రమంలో అలెక్ట్స్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని తేల్చింది. వైద్య పరీక్షల్లో కూడా అతను నేరం చేసినట్లు రుజువైంది. హెర్ఫోర్డ్ క్రౌన్ కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక హెబ్ బర్న్ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే.

2017లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో 23 ఏళ్ల అలెక్స్ హెప్‌బర్న్ ఇంగ్లండ్‌లోని వార్చెస్టెర్‌షేర్‌ కౌంటీ క్రికెట్ క్లబ్‌ తరపున ఆడుతున్నాడు. ఓ రోజు తన సహచర ఆటగాడు జో క్లార్క్‌ ఓ అమ్మాయిని తన గదికి తీసుకొచ్చాడు. అదే గదిలో వుంటున్న హెప్‌బర్న్, ఆమె నిద్రపోయిన తర్వాత రేప్ చేశాడు.

ఓ వాట్సాప్ గ్రూప్ గేమ్ కోసమే... ఈ దారుణానికి పాల్పడ్డాడని ఈ కేసును వాదించిన ఆమె తరపు లాయర్ మిరండా మూరే తెలిపారు. ఆ వాట్సాప్ గ్రూప్ గేమ్ రూల్స్ ప్రకారం.. ఆ గ్రూప్‌లోని వ్యక్తులు ఎంతమంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నారో ఆ వివరాల్నీ గ్రూప్‌లో పోస్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత.. ఎవరి సంఖ్య ఎక్కువగా ఉంటే.. వాళ్లనే ఈ గేమ్ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ గేమ్‌లో గెలవడానికి హెప్‌బర్న్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మూరే అన్నారు. హెప్‌బర్న్ మాత్రం ఆ అమ్మాయి సంపూర్ణ అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నానని తెలిపాడు. తాను మద్యం మత్తులో ఉంటే... ఆమే వచ్చి తన బెడ్‌పై పడుకొని తనను ముద్దు పెట్టుకుందని అన్నాడు.

తన కళ్లు మూసుకొని ఉండగా... తనను 20 నిమిషాలపాటూ రేప్ చేశాడనీ, తాను మొదట అది క్లార్క్ అనుకున్నాననీ, గొంతు విన్న తర్వాతే అది అలెక్స్ అని అర్థమైందని బాధితురాలు కోర్టులో తెలిపింది. తమను తప్పుదారి పట్టించాలని చూసిన హెప్ బర్న్‌పై కోర్టు మండిపడింది. 

ఇవి కూడా చదవండి :

హిమాలయాల్లో యతి లేదా... ఇండియన్ ఆర్మీ ట్వీట్‌కి ఆధారాలు లేవన్న సైంటిస్టులుఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు... ఏర్పాటు దిశగా జోరందుకున్న ప్రయత్నాలు...

ఉత్తరాంధ్ర, ఒడిశావైపు దూసుకొస్తున్న ఫణి తుఫాను... 10,00,00,000 మందిపై ప్రభావం...
First published: May 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>