T20 World Cup: వార్నర్ మెరుపు ఇన్నింగ్స్.. వరుస విజయాలతో ఆసీస్ జోష్.. శ్రీలంకపై ఘన విజయం

డేవిడ్ వార్నర్ సూపర్ షో

AUS Win: టీ20 వరల్డ్‌ కప్‌లో ఆసీస్ దూకుడు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లో విజయం సాధించింది. కీలకంగా భావించిన శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సొంతం చేసుకుంది. డేవిడ్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ తో లంక కు ఓటమి తప్పలేదు.

 • Share this:
  Aus won by 7 wickets: టీ20 వరల్డ్‌ కప్‌ (T20 World Cup)లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) కేవలం 42 బంతుల్లో 65 పరుగులు సాధించి జట్టుకు ఘన విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక తన ముందు ఉంచిన 155 పరుగుల లక్ష్యాన్నిఆస్ట్రేలియా (Australia)సునాయసంగా ఛేజ్ చేసింది. 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని అందుకుంది. మరో 18 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఆస్ట్రేలియా సూపర్‌ 12 దశలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకొని టోర్నీలో దూసుకుపోతోంది. ఆసీస్ ఆడిన తీరు చూస్తే కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ జట్లలో ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ముందున్నది భారీ లక్ష్యం కాకపోయినా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌ పించ్‌, వార్నర్‌లు ధాటిగానే ఆడారు. తొలి వికెట్‌కు 70 పరుగులు చేయడంతో మంచి ఆరంభం మొదలైంది. తరువాత ఫించ్‌, మ్యాక్స్‌వెల్‌ ఔటైన తర్వాత వార్నర్‌ జోరుగా ఆడడంతో ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేసింది.. స్మిత్‌ 28 పరగులు నాటౌట్‌గా నిలిచాడు. అప్పటికే గెలుపు డిసైడ్ అయినా.. చివర్లో మార్కస్‌ స్టోయినిస్‌ 7 బంతుల్లో 16 పరుగులతో ధీటుగా ఆడడంతో మ్యాచ్‌ త్వరగానే ముగిసింది.

  ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో కుషాల్‌ పెరీరా, చరిత్‌ అసలంక చెరో 35 పరుగులు చేయగా.. బానుక రాజపక్స 33 పరుగులతో ఆఖర్లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడాడు. దీంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. అయితే బౌలింగ్‌లో ఆస్ట్రేలియాను కట్టడి చేయకపోవడంతో శ్రీలంక ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

  ఇదీ చదవండి : టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఫైనల్ చేసేది వారే అంటూ క్లారిటీ

  శ్రీలంక కు మొదట శుభారంభమే లభించింది. ఓపెనర్ కుశాల్ పెరీరా(25 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్ కలిపి 35), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చరిత్ అసలంక(27 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్ లతో 35 పరుగులు) చేశారు.. మిడిలార్డర్‌లో భానుక రాజపక్స( 26 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్ తో కలిపి 33 రన్స్) గౌరవప్రదమైన స్కోర్లు చేశారు. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడం జంపా తలా 2 వికెట్లు తీసుకున్నారు.

  ఇదీ చదవండి : మళ్లీ భయపెడుతున్న డెల్టా వేరియంట్‌ AY4.2.. ఒక్క రోజే 52 వేలకుపైగా కేసులు..

  ఈ గెలుపుతో వార్నర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వార్నర్‌ ఇన్నింగ్స్‌తో అతని ఫ్యాన్స్‌ సంబరాల్లో మునిగిపోయారు. వారి సంబరాలకు కారణం ఏంటంటే వార్నర్‌ ఫామ్‌లోకి రావడమేనంట. అందుకు తగ్గట్టుగానే వార్నర్‌ ఫిఫ్టీ సాధించిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌వైపు చూస్తూ నేను ఫామ్‌లోకి వచ్చా.. గుర్తుపెట్టుకోండి అన్నట్లుగా చేతితో విజయం గుర్తును చూపించాడు. ప్రస్తుతం వార్నర్‌ ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

  నిజానికి టి20 ప్రపంచకప్‌ ఆరంభమైన తర్వాత వార్నర్‌ ఫామ్‌ ఆ జట్టును ఆందోళన పరిచింది. అయితే (అక్టోబర్‌ 27) వార్నర్‌ తన బర్త్‌డే సందర్భంగా ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. నేను ఫామ్‌లోకి వచ్చేందుకు ఒక్క మ్యాచ్‌ చాలు అన్ని కామెంట్‌ చేశాడు. కాగా వార్నర్‌ ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన మరునాడే శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్‌ ఆడి తన ఫామ్‌ను చూపించాడు.
  Published by:Nagesh Paina
  First published: