Australia vs Sri Lanka, Live Cricket Score, ICC World Cup 2019 in London: లండన్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 335 పరుగుల భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక తడబడి చివరకు 247 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కరుణరత్నే(97), కుశల్ పెరిరా(52) రాణించినప్పటికీ శ్రీలంక బ్యాట్స్ మెన్ భారీస్కోరు చేజింగ్ చేయడంలో చతికిల పడ్డారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 335 పరుగులు లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. ఆస్ట్రేలియా కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్(153) అద్భుతమైన సెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఇదిలా ఉంటే తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ను ఎంచుకొని ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(26), ఫించ్ రాణించడంతో తొలి వికెట్ కు ఆస్ట్రేలియా 80 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. అనంతరం ఉస్మాన్ ఖవాజా కేవలం 10 పరుగులకే పెవిలియన్ బాటపట్టినప్పటికీ స్టీవ్ స్మిత్, ఫించ్ జోడీ సెటిలై పరుగుల వరద పారించడంతో ఏకంగా మూడోవికెట్ కు ఏకంగా 173పరుగుల భాగస్వామ్యం తోడైంది. ఆ తర్వాత 42 ఓవర్లో ఫించ్ ఔట్ కాగా, స్మిత్ కూడా ఆ తర్వాత ఓవర్లోనే పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మాక్స్ వెల్ ఆఖరి ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటంతో ఆస్ట్రేలియా స్కోరు 300 దాటింది. శ్రీలంక బౌలర్లలో ఉడానా, ధనంజయ డిసిల్వా చెరో రెండు వికెట్లు చొప్పున పడగొట్టగా, మలింగా ఒక వికెట్ పడగొట్టారు.
Australia win by 87 runs!
It was all going so well for Sri Lanka before a late innings collapse saw Australia seal their fourth win of #CWC19. pic.twitter.com/ACKTeee6Q2
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Cricket World Cup 2019, ICC Cricket World Cup 2019, Sri Lanka