ICC World Cup 2019 | ఫించ్ పంచ్‌కు లంక లక లక...శ్రీలంక టార్గెట్ 335 రన్స్

Australia vs Sri Lanka, Live Cricket Score, ICC World Cup 2019 in London: లండన్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 335 పరుగులు లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. ఆస్ట్రేలియా కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్(153) అద్భుతమైన సెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది.

news18-telugu
Updated: June 15, 2019, 10:53 PM IST
ICC World Cup 2019 | ఫించ్ పంచ్‌కు లంక లక లక...శ్రీలంక టార్గెట్ 335 రన్స్
సెంచరీతో అదరగొట్టిన ఫించ్
news18-telugu
Updated: June 15, 2019, 10:53 PM IST
Australia vs Sri Lanka, Live Cricket Score, ICC World Cup 2019 in London: లండన్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 335 పరుగులు లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. ఆస్ట్రేలియా కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్(153) అద్భుతమైన సెంచరీతో రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 335 పరుగులు లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. ఆస్ట్రేలియా కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్(153) అద్భుతమైన సెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఇదిలా ఉంటే తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ను ఎంచుకొని ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(26), ఫించ్ రాణించడంతో తొలి వికెట్ కు ఆస్ట్రేలియా 80 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. అనంతరం ఉస్మాన్ ఖవాజా కేవలం 10 పరుగులకే పెవిలియన్ బాటపట్టినప్పటికీ స్టీవ్ స్మిత్, ఫించ్ జోడీ సెటిలై పరుగుల వరద పారించడంతో ఏకంగా మూడోవికెట్ కు ఏకంగా 173పరుగుల భాగస్వామ్యం తోడైంది. ఆ తర్వాత 42 ఓవర్లో ఫించ్ ఔట్ కాగా, స్మిత్ కూడా ఆ తర్వాత ఓవర్లోనే పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మాక్స్ వెల్ ఆఖరి ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటంతో ఆస్ట్రేలియా స్కోరు 300 దాటింది. శ్రీలంక బౌలర్లలో ఉడానా, ధనంజయ డిసిల్వా చెరో రెండు వికెట్లు చొప్పున పడగొట్టగా, మలింగా ఒక వికెట్ పడగొట్టారు.

First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...