ICC World Cup 2019| నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్...

Australia vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match in Taunton: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. 7 ఓవర్లు ముగిసే నాటికి ఆస్ట్రలియా వికెట్లేమి నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో ఫించ్ (16), వార్నర్ (18) నిలకడగా ఆడుతున్నారు.

news18-telugu
Updated: June 12, 2019, 3:58 PM IST
ICC World Cup 2019| నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్...
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్
news18-telugu
Updated: June 12, 2019, 3:58 PM IST
Australia vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match in Taunton: టాంటన్‌ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. 7 ఓవర్లు ముగిసే నాటికి ఆస్ట్రలియా వికెట్లేమి నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో ఫించ్ (16), వార్నర్ (18) నిలకడగా ఆడుతున్నారు.   ఇప్పటికే భారత్ తో్ జరిగిన మ్యాచ్ లో అపజయం మూటగట్టుకున్న ఆస్ట్రేలియా, ఎలాగైన ఈ మ్యాచ్ లో రాణించి వరల్డ్ కప్ టోర్నీలో సత్తా చాటుకోవాలని ఊవిళ్లూరుతోంది. గత మ్యాచ్ లో భారత్ విధించిన భారీ లక్ష్య ఛేదనలో కంగారూ బ్యాట్స్ మెన్ కాస్త ఖంగారు పడనప్పటికీ మూడు వందల స్కోరు దాటించి లక్ష్యానికి సమీపం వరకూ వచ్చి పరాజయం పాలయ్యారు. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం ఎలాగైన గెలుపే లక్ష్యంగా సాగాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు సైతం ఈ నెల 16న భారత్ తో జరిగే మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో తలపడాలని భావిస్తోంది. గత మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ తో తడబడ్డప్పటికీ, రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి సత్తా చాటింది.

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ వార్నర్, స్మిత్ వరుసగా అర్థసెంచరీలు చేసి ఫామ్ లో ఉండటం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశమే. అలాగే టెయిలెండర్లలో కౌల్టర్ నైల్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 92 పరుగులు చేసి సత్తా చాటాడు. వీరితో పాటు అటు బౌలర్లలో మిచెట్ స్టార్క్ , పాట్ కమ్మిన్స్ కూడా నిలకడగా రాణించడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశం.



First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...