ICC World Cup 2019 | రాణిస్తున్న పాక్ బౌలర్లు...సెంచరీ చేసి వార్నర్ ఔట్...

Australia vs Pakistan Live Score | 38 ఓవర్లు ముగిసే నాటికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. నాలుగో వికెట్ రూపంలో డేవిడ్ వార్నర్ 107 పరుగులు చేసి వెనుదిగరగా, క్రీజులో షాన్ మార్ష్, ఖవాజా ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఓపెనర్ గా శుభారంభం ఇచ్చిన ఆరోన్ ఫించ్ 82 పరుగులకు ఔట్ కావడంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

news18-telugu
Updated: June 12, 2019, 6:05 PM IST
ICC World Cup 2019 | రాణిస్తున్న పాక్ బౌలర్లు...సెంచరీ చేసి వార్నర్ ఔట్...
రాణిస్తున్న పాక్ బౌలర్లు
news18-telugu
Updated: June 12, 2019, 6:05 PM IST
Australia vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match in Taunton: టాంటన్‌ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. 38 ఓవర్లు ముగిసే నాటికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. నాలుగో వికెట్ రూపంలో డేవిడ్ వార్నర్ 107 పరుగులు చేసి వెనుదిగరగా, క్రీజులో షాన్ మార్ష్, ఖవాజా ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఓపెనర్ గా శుభారంభం ఇచ్చిన ఆరోన్ ఫించ్ 82 పరుగులకు ఔట్ కావడంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలాగే స్టీవ్ స్మిత్ సైతం కేవలం 10 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మాక్స్ వెల్ సైతం 20 పరుగులకే ఔట్ అయినప్పటికీ మరో ఎండ్ నుంచి డేవిడ్ వార్నర్ పరుగుల వరద పారిస్తుండటం విశేషం. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్, షోయబ్ మాలిక్, వాహబ్ రియాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్ తో్ జరిగిన మ్యాచ్ లో అపజయం మూటగట్టుకున్న ఆస్ట్రేలియా, ఎలాగైన ఈ మ్యాచ్ లో రాణించి వరల్డ్ కప్ టోర్నీలో సత్తా చాటుకోవాలని ఊవిళ్లూరుతోంది. గత మ్యాచ్ లో భారత్ విధించిన భారీ లక్ష్య ఛేదనలో కంగారూ బ్యాట్స్ మెన్ కాస్త ఖంగారు పడినప్పటికీ మూడు వందల స్కోరు దాటించి లక్ష్యానికి సమీపం వరకూ వచ్చి పరాజయం పాలయ్యారు. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం ఎలాగైన గెలుపే లక్ష్యంగా సాగాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు సైతం ఈ నెల 16న భారత్ తో జరిగే మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో తలపడాలని భావిస్తోంది. గత మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ తో తడబడ్డప్పటికీ, రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ వార్నర్, స్మిత్ వరుసగా అర్థసెంచరీలు చేసి ఫామ్ లో ఉండటం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశమే. అలాగే టెయిలెండర్లలో కౌల్టర్ నైల్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 92 పరుగులు చేసి సత్తా చాడటం విశేషం.

 

Loading...
First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...