ICC World Cup 2019 | పాకిస్థాన్ లక్ష్యం 308 పరుగులు... మహ్మద్ ఆమీర్ దెబ్బకు ఆసీస్ విల విల...

Australia vs Pakistan | ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 307 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాకిస్థాన్ బౌలింగ్ లో మహ్మద్ ఆమీర్ 5 వికెట్లు సాధించడం విశేషం. ఓపెనర్ వార్నర్ 107 పరుగులతో సెంచరీ చేసి శుభారంభం ఇచ్చినప్పటికీ పాకిస్థాన్ బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాట్స్ వెన్ 49 ఓవర్లకే ఆలౌటయ్యారు.

news18-telugu
Updated: June 12, 2019, 7:19 PM IST
ICC World Cup 2019 | పాకిస్థాన్ లక్ష్యం 308 పరుగులు... మహ్మద్ ఆమీర్ దెబ్బకు ఆసీస్ విల విల...
ఆసీస్ బ్యాట్స్ మెన్ వైఫల్యం..
news18-telugu
Updated: June 12, 2019, 7:19 PM IST
Australia vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match in Taunton: టాంటన్‌ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 307 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాకిస్థాన్ బౌలింగ్ లో మహ్మద్ ఆమీర్ 5 వికెట్లు సాధించడం విశేషం. ఓపెనర్ వార్నర్ 107 పరుగులతో సెంచరీ చేసి శుభారంభం ఇచ్చినప్పటికీ పాకిస్థాన్ బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాట్స్ వెన్ 49 ఓవర్లకే ఆలౌటయ్యారు. ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఫించ్ (89), వార్నర్ (107) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్ కు ఏకంగా 146 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఒక దశలో ఆస్ట్రేలియా భారీ స్కోరును సాధిస్తుందని అంతా అంచనా వేశారు. అయితే పాకిస్థాన్ రెగ్యులర్ గా వికెట్లు పడగొట్టడంతో పాటు ఆసీస్ బ్యాట్స్ మెన్ సైతం క్రీజులో పరుగులు సాధించడంలో విఫలం కావడంతో 307 పరుగులకే పరిమితమైంది. స్టీవ్ స్మిత్ (10), గ్లెన్ మాక్స్ వెల్ (20), షాన్ మార్ష్ (23), ఖవాజా (18), అలెక్స్ కారీ (20), కౌల్టర్ నైల్ (2), పాట్ కమ్మిన్స్ (2), మిషెల్ స్టార్క్ (3) తక్కువ పరుగులకే ఔటయ్యారు.

ఇక పాకిస్థాన్ బౌలింగ్ విషయానికి వస్తే మహ్మద్ ఆమీర్ 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను 300 పరుగుల వద్దే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే షహీన్ అఫ్రీదీ 2 వికెట్లు, హసన్ ఆలీ, వహాబ్ రియాజ్, మహ్మద్ హఫీజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్ తో్ జరిగిన మ్యాచ్ లో అపజయం మూటగట్టుకున్న ఆస్ట్రేలియా, ఎలాగైన ఈ మ్యాచ్ లో రాణించి వరల్డ్ కప్ టోర్నీలో సత్తా చాటుకోవాలని ఊవిళ్లూరుతోంది. గత మ్యాచ్ లో భారత్ విధించిన భారీ లక్ష్య ఛేదనలో కంగారూ బ్యాట్స్ మెన్ కాస్త ఖంగారు పడినప్పటికీ మూడు వందల స్కోరు దాటించి లక్ష్యానికి సమీపం వరకూ వచ్చి పరాజయం పాలయ్యారు. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం ఎలాగైన గెలుపే లక్ష్యంగా సాగాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు సైతం ఈ నెల 16న భారత్ తో జరిగే మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో తలపడాలని భావిస్తోంది.



First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...