Home /News /sports /

AUSTRALIA VS ENGLAND PAT CUMMINS TAKEN 5 WICKETS IN GABBA TEST CUMMINS EQUALED 127 YEARS AGO RECORD AS DEBUT CAPTAIN JNK

AUS vs ENG: గబ్బాలో 5 వికెట్లు తీసిన కెప్టెన్ పాట్ కమిన్స్.. 127 ఏళ్ల రికార్డు సమం చేసిన ఆసీస్ కెప్టెన్

కెప్టెన్‌గా 127 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన పాట్ కమిన్స్ (Cricket Australia)

కెప్టెన్‌గా 127 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన పాట్ కమిన్స్ (Cricket Australia)

Pat Cummins: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియన్‌గా చరిత్ర సృష్టించాడు. గబ్బా వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు.

ఇంకా చదవండి ...
    బ్రిస్బేన్‌లోని గబ్బా (Gabba Test) వేదికగా యాషెస్ సిరీస్ (Ashes Series) మొదలైంది. ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ (Australia vs England) మధ్య జరిగే ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో తొలి మ్యాచ్ పింక్ బాల్ టెస్టుగా (Pink Ball Test) నిర్వహిస్తున్నారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (Joe Root) బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అదెంత తప్పు నిర్ణయమో త్వరగానే తెలిసి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమిన్స్ కప్టెన్‌గా నియమించబడిన తర్వాత ఇదే తొలి టెస్టు మ్యాచ్. అయితే కెప్టెన్‌గా తొలి టెస్టులోనే పాట్ కమిన్స్ 127 ఏళ్ల రికార్డును సమం చేశాడు. పాట్ కమిన్స్ గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. కెప్టెన్‌గా అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు. 127 ఏళ్ల క్రితం 1894లో ఫాస్ట్ బౌలర్ జార్జ్ గిఫెన్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో గిఫెన్ కెప్టెన్‌గా అరంగేట్రం చేసి 155 పరుగులకు 6 వికెట్లు తీశాడు. ఇక గబ్బా టెస్టులో కమిన్స్ 5 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, జోష్ మాజెల్ వుడ్ చెరి రెండు వికెట్లు, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్ పేసర్లు దూకుడుగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ 147 పరుగులకే కుప్ప కూలింది.

    గబ్బా మైదానం మేఘావృతమైం ఉండటమే కాకుండా.. పిచ్‌పై పచ్చగా గడ్డి ఉండటంతో జో రూట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే అనుమానంతో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ నిర్ణయం తప్పని తేలింది. మిచెల్ స్టార్ అద్భుతమైన స్వింగ్ బంతులతో ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టాడు. అద్భుతమైన యార్కర్‌కు రోరీ బర్న్స్ పెవీలియన్ చేరాడు. డేవిడ్ మలన్ (6) జోష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో అవుటవగా.. ఈ ఏడాది టెస్టుల్లో వరుస సెంచరీలతో చెలరేగిన కెప్టెన్ జో రూట్ డకౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

    Test Cricket: ఒకే సమయంలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్!! ఎప్పుడు? ఎక్కడ? ఈ అరుదైన రికార్డు నమోదయ్యింది!!




    ఆ తర్వాత బెన్ స్టోక్స్.. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇదే కమిన్స్‌కు కెప్టెన్‌గా తొలి వికెట్. ఇక జోస్ బట్లర్ (39), ఓలీ పోప్ (35) కాసేపు క్రీజులో నిలబడి ఇంగ్లాండ్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరితో పాటు.. హసీబ్ హమీద్ (25). క్రిస్ వోక్స్ వికెట్లను కూడా కమిన్స్ తీసి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు.

    Hardik Pandya: టెస్టులకు హార్దిక్ పాండ్యా గుడ్ బై? సుదీర్ఘ ఫార్మాట్ వదిలేయడానికి అసలు కారణం ఇదే


    ఆస్ట్రేలియాలో మూడు ఫార్మాట్లకు జాతీయ జట్టులో ఆడే అతి కొద్ది మంది క్రికెటర్లలో పాట్ కమిన్స్ ఒకడు. ఇప్పటి వరకు 35 టెస్టులు, 69 వన్డేలు, 37 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాట్ కమిన్స్ నెంబర్ వన్ బౌలర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 169 వికెట్లు, వన్డేల్లో 111, టీ20ల్లో 42 వికెట్లు తీశాడు. కాగా ఆసీస్‌కు 47వ కెప్టెన్‌గా యాషెస్ ముందే నియమించబడ్డాడు. కాగా. 1956 తర్వాత ఆస్ట్రేలియాకు కెప్టెన్ అయిన ఫాస్ట్ బౌలర్‌గా కూడా కమిన్స్ రికార్డు సృష్టించాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: England vs Australia, ICC, Pat cummins, Test Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు