టీ20 వరల్డ్ కప్‌‌లో ఆ టీమ్సే హాట్ ఫేవరెట్స్.. ఆసీస్ కప్పు గెలుస్తుందన్న షేన్‌వార్న్

ఇప్పటికే వరుస ఓటములతో డీలా పడిపోయిన ఆసీస్ క్రికెట్ టీమ్‌ను.. రాబోయే టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? ప్రస్తుత పరిస్థితుల్లో అంత సీన్ లేదనే సమాధానమే వినిపిస్తుంది. అయితే ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్ మాత్రం.. కంగారూలపై విశ్వాసం ఉంచుతున్నాడు.

news18-telugu
Updated: February 5, 2019, 10:04 PM IST
టీ20 వరల్డ్ కప్‌‌లో ఆ టీమ్సే హాట్ ఫేవరెట్స్.. ఆసీస్ కప్పు గెలుస్తుందన్న షేన్‌వార్న్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్ (Image: ICC)
news18-telugu
Updated: February 5, 2019, 10:04 PM IST
ఇప్పటికే వరుస ఓటములతో డీలా పడిపోయిన ఆసీస్ క్రికెట్ టీమ్‌ను.. రాబోయే టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? ప్రస్తుత పరిస్థితుల్లో అంత సీన్ లేదనే సమాధానమే వినిపిస్తుంది. అయితే ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్ మాత్రం.. కంగారూలపై విశ్వాసం ఉంచుతున్నాడు. రాబోయే టీ20 వరల్డ్‌కప్‌ను ఆసీస్ జట్టు గెలుచుకునే అవకాశం లేకపోలేదన్నాడు. అయితే, ఇటీవల కాలంలో ఇంటాబయటా సత్తా చాటుతున్న టీమిండియా కచ్చితంగా హాట్ పేవరెట్ టీమ్స్‌లో ఉంటుందన్నాడు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా.. ఆ మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీని మాత్రమే కోల్పోయింది. అన్ని పటిష్ట టీమ్‌లను ఎదుర్కొని ఫైనల్‌కు చేరిన టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితే, అనంతరం జరిగిన అన్ని సిరీసుల్లోనూ సత్తాచాటింది. అటు, ఇంగ్లండ్ జట్టు సైతం మంచి జోష్ మీద ఉంది. ఈ లెక్కన టీమిండియా, ఇంగ్లండ్ జట్లే టీ20 వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరెట్స్ అంటున్నాడు ఈ వెటరన్ స్పిన్నర్.

అయితే, ప్రస్తుతం ఉన్న ఆసీస్ జట్టులో మ్యాచ్ విన్నర్స్ ఉన్నారని, పరిస్థితులకు అనుగుణంగా ఆడగలిగితే వరల్డ్ కప్ గెలిచే సత్తా కంగారూలకు ఉందని షేన్ వార్న్ చెప్పాడు. తన అంచనా ప్రకారం టీమిండియా, ఇంగ్లండ్ జట్లే రాబోయే గ్రాండ్ ఈవెంట్‌లో హాట్ ఫేవరెట్స్‌గా నిలుస్తాయనడంలో సందేహం లేదన్నారు.

First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...