news18-telugu
Updated: January 7, 2019, 3:02 PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కోచ్ రవిశాస్త్రి(Photo:ANI)
ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ విజయాన్ని 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయంతో పోల్చారు భారత జట్టు కోచ్ రవి శాస్త్రి. సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో...ఆస్ట్రేలియాలో నాలుగు టెస్ట్ సిరీస్‌లను భారత జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టుకిది తొలి టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌ను, మెల్బోర్న్లో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో భారత విజయం సాధించగా...పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్, సిడ్నీలో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తొలి టెస్ట్ మ్యాచ్ మొదలుకొన్ని చివరి టెస్ట్ మ్యాచ్ వరకు భారత జట్టు పూర్తి ఆధిక్యాన్ని కనబర్చింది. టెస్ట్ సిరీస్ విజయంతో మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూంలోనూ టీమిండియా ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి.
ఆసీస్ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ విజయంపై స్పందించిన రవిశాస్త్రి...ఇది 1983 వరల్డ్ కప్ విజయం, 1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తో దక్కిన ఆనందం ఇప్పుడు ఈ విజయంతో తనకు దక్కిందని వ్యాఖ్యానించారు. అసలు సిసలైన టెస్ట్ ఫార్మెట్లో ఈ విజయం దక్కించుకోవడం గొప్ప విషయమన్నారు. టెస్ట్ సిరీస్ విజయం రాత్రికిరాత్రి వచ్చింది కాదని...సంవత్సరకాలంగా కాంబినేషన్లను మార్చుతూ, పలు ప్రయోగాలు చేస్తే ఇప్పుడు విజయం దక్కిందని రవిశాస్త్రి అన్నారు.
Published by:
Janardhan V
First published:
January 7, 2019, 3:02 PM IST