IND vs AUS 1st ODI: టీమిండియా టార్గెట్ 289...డెత్ ఓవర్లలో తేలిపోయిన భారత బౌలర్లు

India Vs Australia 1st ODI | సిడ్నీ వన్డేలో 50 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 288 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమవ్వడంతో ఆతిధ్య జట్టు 300 పరుగులకు పైగా స్కోర్ నమోదు చేయలేకపోయింది.

news18-telugu
Updated: January 14, 2019, 6:03 PM IST
IND vs AUS 1st ODI: టీమిండియా టార్గెట్ 289...డెత్ ఓవర్లలో తేలిపోయిన భారత బౌలర్లు
వన్డే సిరీస్ ట్రోఫీతో ఆరోన్ ఫించ్, విరాట్ కొహ్లీ ( ICC/ twitter )
news18-telugu
Updated: January 14, 2019, 6:03 PM IST
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్నుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమవ్వడంతో ఆతిధ్య జట్టు 300 పరుగులకు పైగా స్కోర్ నమోదు చేయలేకపోయింది. భారత జట్టు బౌలర్లు ఆస్ట్రేలియా ఓపెనర్లు అలెక్స్ క్యారీ, ఆరోన్ ఫించ్‌లను కట్టడి చేసినా ఫలితం లేకుండా పోయింది. పీటర్ హ్యాండ్స్‌కూంబ్(73), షాన్ మార్ష్(54), ఉస్మాన్ ఖవాజా(59) హాఫ్ సెంచరీలతో ఆసీస్ టీమ్ కోలుకుంది. లోయర్ ఆర్డర్‌లో మార్కస్ స్టోయినిస్(47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 288 పరుగులు స్కోరు సాధించింది. చివరి 10 ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్‌మన్లు 93 పరుగులు రాబట్టారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో భారత జట్టు ముందు ఆసీస్ 289 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ విఫలమవ్వడంతో టీమిండియా 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.



తొలి వన్డే ఆడుతున్న భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ ( వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, ధోనీ, దినేష్ కార్తీక్, అంబటి రాయుడు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్
First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...