సోషల్ మీడియాలో ఈ క్రికెటర్ ఉన్నంత బిజీగా మరెవరూ ఉండరంటే..నిజమని ఒప్పుకోక తప్పుదు. ఆ క్రికెటర్ ఎవరనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner). ఈ దిగ్గజ క్రికెటర్ ఐపీఎల్ ఆడుతున్నప్పటి నుంచి మన ఇండియన్ సినిమాలపై మక్కువ పెంచుకున్నాడు. ముఖ్యంగా, మన దక్షిణాది సినిమాలన్నా, హీరోలన్నా వార్నర్ ఎక్కువ ఇష్టపడుతుంటాడు. ఇష్టపడటమే కాదండోయ్..వారు నటించిన సినిమాల్లోని పాటలకు డాన్సులు వేయడం, డైలాగ్స్‌ను చెప్పడం వంటి పనులు చేసి ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సదరు హీరోల అభిమానులను అలరిస్తుంటాడు వార్నర్. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. బుట్టబొమ్మ సాంగ్‌లో భార్యతో వార్నర్ వేసిన స్టెప్పులేయడం, బాహుబలిలో ప్రభాస్ డైలాగ్‌ను చెబుతూ వీడియోలు చేయడం, అలాగే పేస్ ఆఫ్ యాప్‌ను ఉపయోగించి సౌత్స్టార్స్ సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో సదరు హీరోల స్థానంలో రీ ఫేస్ యాప్ ద్వారా తన ఫేస్‌ను అతికించి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు.తెలుగు, తమిళ్, హింది అన్న తేడా లేకుండా.. వీడియోలతో ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తుంటాడు వార్నర్. ఐపీఎల్ తర్వాత వీటికి బ్రేక్ ఇచ్చిన వార్నర్ మళ్లీ మొదలుపెట్టేశాడు.
లేటెస్ట్ గా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో స్వదేశానికి చేరుకున్న వార్నర్ విరామం దొరకడంతో మరోసారి ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్ చేశాడు.తాజాగా స్వాప్ వీడియోతో ముందుకు వచ్చిన వార్నర్ టైగర్ ష్రాప్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు. ఆలియా భట్ తో డ్యాన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. స్వాపింగ్ యాప్‌తో టైగర్ ష్రాఫ్ ముఖానికి బదులుగా తన ముఖాన్ని స్వాప్ చేసి వీడియోను రిలీజ్ చేశాడు. ఇదంతా నా అభిమానుల డిమాండ్ మేరకే అంటూ వార్నర్ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం వార్నర్ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.
View this post on Instagram
అయితే, ఐపీఎల్ 14వ సీజన్ కరోనా కారణంగా రద్దు కావడంతో స్వదేశానికి చేరుకున్న వార్నర్ 15రోజుల పాటు సిడ్నీలోని హోటల్లో కఠిన క్వారంటైన్లో గడిపాడు. ఇటీవలే ఐసోలేషన్ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను కలుసుకున్నారు. సుధీర్ఘ విరామం తర్వాత తమ కుటుంభసభ్యులను కలుసుకోవడంతో ఆటగాళ్లంతా ఎమెషన్‌కు గురయ్యారు. ఇక ఆస్ట్రేలియా జూలైలో విండీస్‌లో పర్యటించనుంది. విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేలు ఆడనుంది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ జరుగుతున్న సమయంలోనే డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Bollywood news, Cricket, David Warner, Tiger shroff