Australia Open 2019 : జకోవిచ్ వర్సెస్ నాదల్... టైటిల్ విజేత ఎవరు?

Australia Open Men's Single Final 2019 : ఈసారి ఎన్నో సంచలనాలు నమోదుచేసిన ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ పోరుకు చేరింది. ఇటు నాదల్, అటు జకోవిచ్ ఇద్దరూ తిరుగులేని ఆటగాళ్లే. అందుకే ఇవాళ జరిగే ఫైనల్ పోరు అభిమానుల్లో ఆసక్తిని పెంచేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 27, 2019, 6:57 AM IST
Australia Open 2019 : జకోవిచ్ వర్సెస్ నాదల్... టైటిల్ విజేత ఎవరు?
నాదల్, జకోవిచ్
  • Share this:
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఇవాళ జరిగే మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ జకోవిచ్‌, నెంబర్‌ టు నాదల్‌ ఢీ కొట్టుకోబోతున్నారు. ఆసీస్ గడ్డపై ఏడో టైటిల్‌ కోసం పోరాడుతున్న జకోవిచ్ ఇవాళ్టి గేమ్‌లో గెలిస్తే... ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డ్ అతని సొంతమవుతుంది. అదే నాదల్‌ గెలిస్తే... ఓపెన్‌ ఎరాలో ప్రతి గ్రాండ్‌స్లామ్‌నూ రెండేసిసార్లు సాధించిన మొదటి ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఐతే... వీళ్లిద్దరికీ ఈ టైటిల్ పోరు కొత్తేమీ కాదు. సెర్బియా ఆటగాడు జకోవిచ్ 53వసారి నాదల్‌తో తలపడుతున్నాడు. ఎనిమిదోసారి గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్నాడు. గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ రికార్డులో జకోవిచ్‌పై నాదల్‌ 4-3తో ముందంజలో ఉన్నాడు.



ఇద్దరూ చివరిసారి 2014 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌లో ఆడగా... నాదలే ఛాంపియన్ అయ్యాడు. అంతకుముందు గ్రాండ్‌స్లామ్‌ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన 2012 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ఇద్దరూ పోటీపడ్డారు. 5 గంటల 53 నిమిషాల పాటు జరిగిన ఆ పోరులో జకోవిచ్‌ గెలిచాడు. అందువల్ల ఇవాళ గెలుపు ఎవరిది అన్నది ఆసక్తి రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ పోరు మొదలవ్వబోతోంది.


గురువారం జరిగిన తొలి సెమీస్‌లో 20 ఏళ్ల టిట్సిపాస్‌ను చిత్తు చేసి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫైనల్ చేరగా... శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో జోకోవిచ్... ఫ్రెంచ్ ఆటగాడు లుకాస్ పౌలీని వరుస సెట్లలో ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చాడు.

 

Video: ఒడిశాలో తెలుగు ప్రకాశం.. ఛాయ్ వాలాకు పద్మ శ్రీ
First published: January 27, 2019, 6:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading