Australia India Twenty20: ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరుగుతున్న ట్వంటి20 సిరీస్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైదొలిగాడు. చివరి ఓవర్లో స్టార్క్ వేసిన బంతి నుదుటి ఎడమవైపు తగిలి... గాయపడిన జడేజా... మిగతా 2 మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. జడేజా స్థానంలో కుడి చేతి వాటం పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపారు. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో... ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇదే ఊపుతో... మిగతా 2 మ్యాచ్‌లను కూడా గెలిచి... సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా... జడేజాను కోల్పోవడం షాకింగే.
రూల్స్ ప్రకారం స్టార్క్ వేసిన బౌన్సర్... జడేజా హెల్మెట్‌కి తగిలినప్పుడు... అప్పటికప్పుడు ఫీల్డులో... అతన్ని చెక్ చెయ్యాల్సి ఉంటుంది. బంతి తగలడం వల్ల జడేజాకు ఏమైనా అయ్యిందా అన్నది తెలుసుకోవాలి. కానీ జడేజాను పరీక్షించడానికి డాక్టర్ రాకపోవడం వివాదాస్పదం అయ్యింది. కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. బంతి హెల్మెట్‌కు తాకినప్పుడు ఫిజియో, మెడికల్ ఎక్స్పర్ట్ బ్యాట్స్‌మెన్‌ను పరిశీలించడం ముఖ్యమన్నాడు. జడేజా మాత్రం... మ్యాచ్ ఆపకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. దీంతో... ఇదో వివాదంగా మారింది.
ప్రస్తుతం జడేజాను పరిశీలనలో ఉంచుతామనీ... అవసరమైతే... మరిన్ని స్కాన్లు చేస్తామని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఈ కారణంగానే జడేజాను నెక్ట్స్ మ్యాచెస్లోకి తీసుకోవట్లేదని వివరించింది.
ఇది కూడా చదవండి:Weight Loss: ఎప్పటికీ యంగ్‌గా కనిపించాలంటే... ఇవీ చిట్కాలు...
జడేజా స్థానంలో శార్దూల్ ఠాకూర్... ఆదివారం, మంగళవారం సిడ్నీలో జరిగే 2 మ్యాచ్‌లలో పాల్గోనున్నాడు.
Published by:Krishna Kumar N
First published:December 05, 2020, 07:46 IST