Home /News /sports /

AUSTRALIA HILTON CARTWRIGHT SMASHES ONE OF THE BIGGEST STRIKES IN CRICKET HISTORY WATCH VIRAL VIDEO SRD

World Biggest Six: ఇదేం బాదుడు సామీ..! స్టేడియం అవతల బంతి.. క్రికెట్ హిస్టరీలోనే భారీ సిక్సర్..! (వీడియో)

Photo Credit : Twitter

Photo Credit : Twitter

World Biggest Six: అమాంతం గాల్లోకి లేచిన ఆ బంతి.. ఎక్కడో పడిందో చూద్దామని అనుకున్నా కెమెరాకు కూడా కనపడలేదు. బంతిని తీసుకొద్దామని వెళ్లిన ఫీల్డర్.. బాల్ ఎక్కడ పడిందో తెలియక అయోమయానికి గురయ్యాడు.

    క్రికెట్ (Cricket Latest Telugu News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. పొట్టి క్రికెట్ వచ్చాక.. క్రికెటర్లు అవలీలగా బంతిని బౌండరీ దాటిస్తున్నారు. ఇక, సింగిల్స్ కొట్టినంత ఈజీగా సిక్సర్లు కొట్టేస్తున్నారు. ఒక బ్యాటర్ ఎన్ని సింగిల్స్, డబుల్స్, ఫోర్లు కొట్టినా సిక్స్ కొడితే వచ్చే కిక్కే వేరు. క్రికెట్ లో టీ20ల హవా మొదలయ్యాక సిక్స్ ల వర్షం కురుస్తోంది. ప్రపంచ విధ్వంసకర బ్యాటర్లు అందరు తమ బలాన్నంతా కూడదీసుకుని సిక్స్ లు కొడుతున్నారు. పొలార్డ్(Pollard), ధోని (Ms Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma), క్రిస్ గేల్ (Chris Gayle), బట్లర్ వంటి హిట్టర్లెందరో భారీ సిక్సర్లతో అభిమానులకు కావాల్సిన మజా అందిస్తున్నారు. అయితే టీ 20, వన్డే ల్లో కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక క్రికెటర్ అతి పెద్ద సిక్సర్ బాదాడు. ఆస్ట్రేలియాకు చెందిన షెఫీల్ షీల్డ్ 2021 22 టోర్నీలో భాగంగా అడిలైడ్ (ఆస్ట్రేలియా)లో జరిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరిగింది.

    ఈ మ్యాచ్ లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్ హిల్టన్ కార్ట్ రైట్ (Hilton Cartwright )ఈ రేర్ ఫీట్ సాధించాడు. ఇన్నింగ్స్ 44 వ ఓవర్లో నాలుగో బంతిని బౌలర్ తలమీదుగా స్ట్రెయిట్ సిక్సర్ కొట్టాడు. అమాంతం గాల్లోకి లేచిన ఆ బంతి.. ఎక్కడో పడిందో చూద్దామని అనుకున్నా కెమెరాకు కూడా కనపడలేదు. బంతిని తీసుకొద్దామని వెళ్లిన ఫీల్డర్.. బాల్ ఎక్కడ పడిందో తెలియక అయోమయానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


    ఇంతలో బయట నుంచి వెళ్తున్న ఒకతను వచ్చి ఆ ఫీల్డర్ కు బంతి ఇచ్చాడు. కార్ట్ రైట్ బాదిన సిక్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనే అతి పెద్ద సిక్స్ గా క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ లో 122 బంతుల్లో 69 పరుగులు చేసిన కార్ట్ రైట్.. 8 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. 2017లో పాకిస్థాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఆసీస్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన కార్ట్ రైట్.. ఆసీస్ తరఫున మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడాడు. తన చివరి వన్డేను భారత్ పైనే ఆడటం గమనార్హం.

    ఇది కూడా చదవండి : నవంబర్ 1 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ లో ఉన్న మోడళ్లు ఇవే..

    ఇక, ఈ సిక్స్ ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వైరల్ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదేమీ బాదుడు సామీ.. కెమెరాకు కూడా చిక్కలేదుగా అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Cricket, Sports, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు