హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Aus:అయ్యో.. పాపం, సంజూ.. ఈ సారి కూడా నిరాశే.. తుది జట్లు ఇవే

Ind Vs Aus:అయ్యో.. పాపం, సంజూ.. ఈ సారి కూడా నిరాశే.. తుది జట్లు ఇవే

రోహిత్, స్టార్క్‌ (File)

రోహిత్, స్టార్క్‌ (File)

ఇక ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలవాలంటే ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడాలి. వరల్డ్‌కప్‌కు ముందు ఎక్కువగా వన్డేలు ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో కోహ్లీ, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాండ్యా కూడా పెద్ద స్కోర్లపై కన్నేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌ మొదలవ్వడానికి ఇంకా కొద్ది నిమిషాల టైమే మిగిలుంది.. ఇప్పటికీ టాస్‌ పడిపోయింది.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్ గెలిచిన జట్లు ముందుగా బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపుతాయని అంతా భావించారు. అయితే స్మిత్‌ మాత్రం బ్యాటింగ్‌ చేయడానికే డిసైడ్ అయ్యాడు. జట్టులోకి డేవిడ్‌ వార్నర్‌ తిరిగొచ్చాడు. ఇక గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ‘గోల్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అయిన సూర్యకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఛాన్స్‌ ఇచ్చారు. సంజూ శాంసన్‌కు నిరాశ తప్పలేదు. ఇక మొదటి వన్డేలో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఘోరంగా ఓడిపోయింది. విశాఖ వేదికగా జరిగిన సెకండ్‌ వన్డేలో 10వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది..రెండో మ్యాచ్‌ విజయంలో ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది.. అయితే టీమిండియా మాత్రం సిరీస్‌ డిసైడర్‌లో దుమ్మురేపాలని ప్లాన్‌ చేసుకుంది. ఆస్ట్రేలియాను ఓడించేందుకు అస్త్రశస్త్రలను సిద్ధం చేసుకుంది. సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తేల్చే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటర్లు దుమ్మురేపాలని చూస్తున్నారు. చెన్నై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలం కావడంతో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అభిమానుల్లో పీక్స్‌కు వెళ్లింది.

రెండో వన్డేలో ఘోర బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కా ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రచించినట్లుగా సమాచారం. స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధాటికి బెంబేలెత్తిన ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలవాలంటే ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడాలి. వరల్డ్‌కప్‌కు ముందు ఎక్కువగా వన్డేలు ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో కోహ్లీ, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాండ్యా కూడా పెద్ద స్కోర్లపై కన్నేశారు. పేసర్లు మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షమీ, సిరాజ్‌ఈ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎలా చెలరేగుతారన్నది చూడాలి. మరోవైపు దాదాపు మూడేళ్ల తర్వాత చిదంబరం స్టేడియంలో పూర్తి స్థాయి ప్రేక్షకుల సామర్థ్యంతో మ్యాచ్‌ జరుగనుంది. ఇందు కోసం రెండు జట్లు తమ వ్యూహ, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో విజయం ఎవరి సొంతమవుతుందో చూడాలి.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినిస్, ఆస్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

First published:

Tags: India vs australia

ఉత్తమ కథలు