Home /News /sports /

AUSTRALIA FORMER CRICKETER STUART MACGILL REVEALS HOW HE BEING KIDNAPPED BY ARMED BANDITS SJN

Stuart MacGill : ’నగ్నంగా కూర్చోబెట్టి.. ఆ తర్వాత‘.. తన కిడ్నాప్ పై సంచలన విషయాలు బయటపెట్టిన ఆసీస్ స్టార్

(PC : TWITTER)

(PC : TWITTER)

Stuart MacGill : ఆస్ట్రేలియా (Australia) మాజీ బౌలర్ స్టువర్ట్ మెక్ గిల్ (Stuart MacGill) తన కిడ్నాప్ వ్యవహారంపై తొలిసారి పెదవి విప్పాడు. అంతేకాకుండా ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలను బయటపెట్టాడు.

Stuart MacGill : ఆస్ట్రేలియా (Australia) మాజీ బౌలర్ స్టువర్ట్ మెక్ గిల్ (Stuart MacGill) తన కిడ్నాప్ వ్యవహారంపై తొలిసారి పెదవి విప్పాడు. అంతేకాకుండా ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలను బయటపెట్టాడు. గతేడాది ఏప్రిల్ నెలలో సిడ్నీలోని తన నివాసం దగ్గర ఉన్న మెక్ గిల్ ను నలుగురు దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడికి తీవ్రంగా కొట్టి వదలిపెట్టారు. అనంతరం ఈ ఘటనపై మెక్ గిల్ ఎక్కడా కూడా నోరు మెదపలేదు. కొన్ని నెలల పాటు ఎవరికీ కనిపించలేదు కూడా.. తాజాగా ఈ కిడ్నాప్ కు సంబంధంచిన విషయాలను మెక్ గిల్ అక్కడి ఒక పత్రికకు తెలియజేశాడు.

ఇది కూడా చదవండి  : పల్లెటూరి క్రికెట్ లా అంతర్జాతీయ మ్యాచ్.. బాల్ కోసం చెట్లు, పుట్టల్లో వెతికిన ప్లేయర్స్

’ఆ రోజు సిడ్నీలోని నా ఇంటి దగ్గర నేను ఉన్నాను. ఇంతలో కొందరు నా ఇంటికి వచ్చి మాతో రావల్సిందిగా కోరారు. అయితే నేను అందుకు ఒప్పుకోలేదు. అయితే నన్ను వారు బలవంతంగా కారు వరకు లాక్కెల్లారు. కార్లో ఎక్కాలంటూ నన్ను బలవంతం చేశారు. నేను ప్రతిఘటించా.. అయితే నువ్వెవరో మాకు తెలుసు నీతో మాట్లాడాలి.. లేదంటే.. అంటూ గన్స్ చూపించి నన్ను భయపెట్టారు. నేను కార్లో ఎక్కగానే నా కళ్లకు గంతలు అలాగే నా చేతులను కట్టేశారు. కార్లో మేం ఎక్కడికి వెళ్లామో నాకు తెలియదు. రహస్య ప్రదేశంలో కారు ఆపి నన్ను దిగమని చెప్పారు. వెంటనే నాతో బట్టలు మొత్తం విప్పించేశారు. నన్ను నగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి నన్ను కొట్టారు. చంపేస్తాం అంటూ బెదిరించారు. ఆ తర్వాత నన్ను ఒక చోట దింపేసి వెళ్లిపోయారు‘ అంటూ కిడ్నాప్ వ్యవహారాన్ని వివరించాడు.



ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని నెలల పాటు తాను ఇంటికి కూడా వెళ్లే ప్రయత్నం చేయలేదని గిల్ పేర్కొన్నాడు. అయితే ఎందుకు కిడ్నాప్ చేశారో మాత్రం పేర్కొనలేదు. గిల్ ను కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులను పోలీసులు కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన విచారణ వచ్చే ఏడాది అక్టోబర్ లో ఉంది. అయితే గిల్ గర్ల్ ఫ్రెండ్ తమ్ముడే ఇదంతా చేయించాడని సమాచారం. డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారంలో మెక్ గిల్ జోక్యం చేసుకోవడంతో ఇదంతా జరిగిందని వార్తలు వస్తున్నాయి. 51 ఏళ్ల గిల్ 1998-2008 మధ్య 44 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 208 వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మూడు మ్యాచ్ లు ఆడి ఆరు వికెట్లు  సాధించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, Cricket, India vs South Africa, Kidnap, Man kidnap, South Africa, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు